News January 14, 2025
రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో దస్తూరాబాద్ విద్యార్థి ప్రతిభ
కోదాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ఓపెన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్-2025లో నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ ZHS విద్యార్థి కొట్టే అభిషేక్ ప్రతిభ చాటి మూడు పతకాలు గెలుచుకున్నాడు. ఇందులో 102 కేజీ కేటగిరి యూత్ విభాగంలో సిల్వర్, జూనియర్ విభాగంలో సిల్వర్, సీనియర్ విభాగంలో బ్రాంజ్ మెడల్‌లను సాధించాడు. అభిషేక్‌ను HM వామాన్ రావ్, PET నవీన్ అభినందించారు.
Similar News
News January 14, 2025
బెల్లంపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
సంక్రాంతి పండగపూట బెల్లంపల్లిలో విషాదం నెలకొంది. కాగజ్‌నగర్‌కు చెందిన రాజేశ్ HYDలో మెకానిక్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. టూ టౌన్ SI మహేందర్ కథనం ప్రకారం.. రాజేశ్ తన భార్య, కుమారుడితో కారులో మంగళవారం కాగజ్‌నగర్ వెళ్తున్నారు. బెల్లంపల్లి గంగారంనగర్ హైవేపై లారీని ఢీకొట్టాడు. ప్రమాదంలో అతడి భార్య రేణుక(30) అక్కడికక్కడే మరణించింది. తీవ్రగాయాలపాలైన రాజేశ్‌ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నాడు.
News January 14, 2025
జాతరకు రావాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆహ్వానం
సారంగాపూర్ మండలం పొట్య గ్రామ పంచాయతీ పరిధిలోని బండ్రేవు తండాలో నాను మహరాజ్ జాతర ఉత్సవాలకు బీజేపీ శాసన సభ పక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి నాను మహారాజ్ జాతర ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ, దావుజీ, ప్రకాష్,జాతర ఉత్సవ కమిటీ సభ్యులు బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
News January 14, 2025
భీమారం: రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల బాలిక దుర్మరణం
ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భీమారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నాలుగేళ్ల అద్వైకరాజ్ దుర్మరణం చెందింది. మంతెన రాజ్ కుమార్ తన భార్య సురేఖ, కుమార్తె అద్వైకరాజ్, తల్లి లక్ష్మమ్మ, మేనకోడలు తేజశ్రీతో కలిసి తమిళనాడులోని ఒక చర్చికి వెళ్లి సోమవారం తిరిగి వస్తుండగా కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.