News December 12, 2025

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఉప్పలగుప్తం విద్యార్థుల ఎంపిక

image

ఉప్పలగుప్తం రాష్ట్ర స్థాయి అండర్-14 సాఫ్ట్ బాల్ పోటీలకు మండలం గొల్లవిల్లి ZP ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. పోటీలకు ఎంపికైన మల్లిపూడి అయ్యప్ప, సవరపు లక్ష్మిలను శుక్రవారం ఆ పాఠశాలలో HM కనకదుర్గ, పీడీలు గొలకోటి ఫణీంద్ర కుమార్, దూలం సరస్వతి, టి.సునీత, వి.విజయభాస్కర్, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థులు రాష్ట్రస్థాయిలో విజయం సాధించడం పట్ల స్కూల్‌కు మంచిపేరు తీసుకొచ్చారన్నారు.

Similar News

News December 12, 2025

వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అమరావతి బిల్లు!

image

అమరావతి రాజధాని చట్టబద్ధత అంశం శుక్రవారం కేంద్ర క్యాబినెట్లో చర్చకు రాలేదు. AP నుంచి మరింత సమాచారం తీసుకుని క్యాబినెట్లో ఆమోదించి అనంతరం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. కాగా సాంకేతిక సమస్యల పరిష్కారంపై AP కసరత్తు చేపట్టింది. 2014-2024 వరకు అమరావతినే రాజధానిగా గుర్తించేలా అది అధ్యయనం చేస్తోంది. ఫ్యూచర్లో రాజధానిని మార్చకుండా ఒకే క్యాపిటల్ ఉండేలా చర్య తీసుకుంటోంది.

News December 12, 2025

ఎన్టీఆర్ జిల్లాలో నవోదయ పరీక్షకు సర్వం సిద్ధం

image

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష (JNVST-2026) కోసం ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,349 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ఈ పరీక్ష డిసెంబర్ 13న ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు కేటాయించిన కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని సూచించారు.

News December 12, 2025

అక్రమ మద్యంపై ఉక్కుపాదం: మంత్రి కొల్లు రవీంద్ర

image

విశాఖలో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర 4 జిల్లాల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అధికారుల ఏడాది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. బెల్ట్ షాపులు, నాటు సారా, కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని అధికారులకు స్పష్టం చేశారు.