News January 4, 2026
రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌కు ధన్వాడ విద్యార్థుల ఎంపిక

జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌లో ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు రాజేందర్, ప్రవీణ్ ప్రతిభ కనబరిచారు. రసాయనాలు లేకుండా ‘సేంద్రీయ వ్యవసాయం’పై వారు రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. డీఈఓ రవీందర్ చేతుల మీదుగా విద్యార్థులు బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రదీప్ కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.
Similar News
News January 9, 2026
టీయూ పరిధిలో పీజీ పరీక్షలు వాయిదా

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 16 నుంచి జరగాల్సిన పీజీ ఎమ్మెస్సీ/ఎంఏ/ఎంకాం/ఎమ్మెస్ డబ్ల్యూ/ఎంబీఏ/ఎంసీఏ/ఐఎంబీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.
News January 9, 2026
క్రీడాకారుడిగా రాణించి.. హత్య కేసులో చిక్కుకుని.!

ముద్దాయి గణేశ్ నేషనల్ లెవెల్ క్రికెటర్. 2021లో దివ్యాంగుల ఐపీఎల్ రాజస్థాన్ రాజ్ వార్స్ టీంకు ఆడాడు. ప్రతి సంవత్సరం జరిగే ఐపీఎల్ పోటీలలో పాల్గొంటున్నాడు. 2023 సంవత్సరంలో ఇండియన్ ఇంటర్నేషనల్ వికలాంగుల క్రికెట్ జట్టుకు ఎంపికయ్యి ఇండియా- నేపాల్ మ్యాచ్లోనూ ఆడాడు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.
News January 9, 2026
అభ్యంతరాలు ఉంటే జాతర తర్వాత కూడా మార్పులు: సీతక్క

మేడారం మాస్టర్ ప్లాన్, చిహ్నాల విషయంలో ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే జాతర తర్వాత మార్పులు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. లోతైన పరిశోధన తర్వాతనే గద్దెల అభివృద్ధి పనులు చేశామని అన్నారు. తన చేతుల మీదుగా జాతరను అభివృద్ధి చేసి వనదేవతలను ఆహ్వానించాలనే సంకల్పం తల్లుల దీవెనతో నెరవేరిందని అన్నారు. ఊరట్టం స్తూపాన్ని ఆదివాసీ అమరవీరుల స్తూపంగా మారుస్తామని అన్నారు.


