News November 6, 2024
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కుకునూరుపల్లి విద్యార్థి
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కుకునూరుపల్లి మండలంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థి ఎండి అబ్దుల్ రహమాన్ ఎంపికయ్యారు. హుస్నాబాద్‌లో జరిగిన ఎస్జీఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా హ్యాండ్ బాల్ అండర్-14 విభాగంలో జిల్లాస్థాయిలో సత్తా చాటి, రాష్ట్రస్థాయికి ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ బచ్చల సత్తయ్య, పీడీ రాజ్ కుమార్ విద్యార్థి అబ్దుల్ రెహ్మాన్‌ను అభినందించారు.
Similar News
News November 6, 2024
మెదక్: GET READY.. నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టనుంది. ప్రతి ఇంటికి వెళ్లి 75 ప్రశ్నలతో ప్రభుత్వ సిబ్బంది సర్వే చేయనున్నారు. కుటుంబ యజమాని, సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, వారు చేసే పని, తీసుకున్న రుణాలు, ఆస్తులు వంటి వివరాలను నమోదు చేసి సర్వే పూర్తయిన ఇంటికి స్టిక్కర్ వెయ్యనున్నారు. ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
News November 5, 2024
మెదక్: రేపటి నుంచి సర్వే.. ఇవి దగ్గర ఉంచుకోండి !
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి సర్వే రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 56 ప్రధాన, 19 అనుబంధం కలిపి మొత్తం 75 ప్రశ్నలుంటాయి. ఆధార్ కార్డులు, రైతులయితే అదనంగా ధరణి పాసుపుస్తకాలు, రేషన్ కార్డు, ఇంటి పన్ను దగ్గర పెట్టుకుంటే ఎన్యూమరేటర్లు వచ్చినపుడు సర్వే సులువుగా పూర్తవుతుంది. సర్వే సందర్భంగా ఎలాంటి ఫొటోలూ తీయరు. పత్రాలు తీసుకోరు. ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.
News November 5, 2024
పటాన్‌చెరు: ఇంటర్ విద్యార్థిని సూసైడ్ UPDATE
పటాన్‌చెరులోని ఐడీఏ బొల్లారం PS పరిధిలో <<14531325>>ఇంటర్ విద్యార్థిని<<>> ఉరివేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. వరంగల్ జిల్లా ఐనవోలుకు చెందిన విద్యార్థిని(16) బొల్లారంలోని నారాయణ కాలేజీలో ఫస్టియర్ చేస్తుంది. సోమవారం స్టడీ హవర్‌కు రాలేదని వెళ్లి చూడగా సెకండ్‌ఫ్లోర్‌లోని హాస్టల్‌లో ఉరేసుకొని కనిపించింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయిందని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.