News November 12, 2024

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో సిక్కోలు సత్తా 

image

రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య హ్యాండ్ బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణులు విజేతలుగా నిలిచారు. గత మూడు రోజులుగా వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగిన అండర్-19 బాలికల రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా బాలికల జట్టు ప్రథమస్థానం సొంతం చేసుకున్నారు. జట్టు కోచ్ మేనేజర్లుగా ఆర్.సతీష్రయుడు, జి.డిల్లీశ్వరరావు, రాజశేఖర్ వ్యవహారించారు.

Similar News

News January 5, 2026

శ్రీకాకుళం: యాక్టివ్ మోడ్‌లోకి ఆ సీనియర్ నేత..పొలిటికల్ గేమ్‌కేనా!

image

2024 ఎన్నికలనంతరం రెండేళ్లుగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు మౌనంగా ఉన్నారు. వైసీపీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు. కూటమిని విమర్శించ లేదు. అయితే ఇటీవల పలు సమావేశాల్లో పక్కా లెక్కలతో మాట్లాడి యాక్టివ్ మోడ్‌లోకొచ్చారు. ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ధర్మాన ప్రసాద్‌కు ఉంది. ఈ సీనియర్‌తోనే వైసీపీ అధినేత జగన్‌ తాడేపల్లి నుంచి పార్టీ బలోపేతానికి వ్యూహం రచిస్తారని అంతర్గత చర్చ సాగుతోంది.

News January 5, 2026

SKLM: పది పాసైతే చాలు 350 ఉద్యోగాలు

image

ఈనెల 7న కొత్తూరులోని శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి సాయికుమార్ ఆదివారం తెలిపారు. 10 కంపెనీలకు చెందిన యాజమాన్యాలు 350 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివి 18-30 ఏళ్ల వయసున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News January 5, 2026

శ్రీకాకుళం: జనవరి 5న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో నేడు జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.