News December 18, 2024
రాష్ట్రానికి అందిన నిధులెన్ని: వేమిరెడ్డి
15వ ఆర్థిక సంఘం నిధులలో ఆంధ్రప్రదేశ్ లోని స్థానిక సంస్థలకు మొదటి విడత అందించిన నిధులు ఎన్ని అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. నిధులు విడుదలైన విషయం వాస్తవం అయితే ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేసిన టైడ్, అన్ టైడ్ గ్రాంట్ల వివరాలు తెలియజేయాలని కోరారు. ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్‌పీ సింగ్ భఘేల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
Similar News
News January 8, 2025
నేడు నెల్లూరు జిల్లా నాయకులతో వైయస్ జగన్ భేటీ
నేడు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నెల్లూరు జిల్లా నేతలతో YCP అధినేత మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని వైసీపీ అధికారిక ‘X’ లో పోస్టు చేసింది. నెల్లూరుకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
News January 7, 2025
రేపు నెల్లూరు జల్లా నాయకులతో వైయస్ జగన్ భేటీ
రేపు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నెల్లూరు జిల్లా నేతలతో YCP అధినేత మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని వైసీపీ అధికారిక ‘X’ లో పోస్టు చేసింది. నెల్లూరుకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
News January 7, 2025
కోడిపందాలు నిర్వహించకుండా చర్యలు చేపట్టండి : కలెక్టర్
సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా కోడిపందాలు నిర్వహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్‌లో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జంతు హింస నివారణ చట్టం అమలుపై ఎగ్జిక్యూటీవ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కోడి పందాలు జరగకుండా గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.