News January 30, 2026
రాష్ట్రానికి రూ.128.43 కోట్ల NHM నిధులు

AP: జాతీయ ఆరోగ్య మిషన్ చివరి విడత కింద ఆయా జిల్లాలకు ప్రభుత్వం రూ.128.43 కోట్లను విడుదల చేసింది. FEB 20లోగా వీటిని ఖర్చు చేయాలని ఆదేశించింది. జిల్లాల వారీగా గుంటూరుకు రూ.20.61 కోట్లు, నెల్లూరుకు రూ.8.60 కోట్లు, కృష్ణాకు రూ.6.21 కోట్లు ఇచ్చారు. మిగిలిన జిల్లాలకు రూ.5.20 కోట్ల నుంచి రూ.2 కోట్ల చొప్పున విడుదల చేసినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు.
Similar News
News February 20, 2026
భారీ జీతంతో RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలు

RITES లిమిటెడ్ 3 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సివిల్ ఇంజినీరింగ్, MA/MSc/ఎన్విరాన్‌మెంట్ డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 9వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ లీడర్‌కు నెలకు రూ.3లక్షలు, సేఫ్టీ, హెల్త్& ఎన్విరాన్‌మెంట్ ఎక్స్‌పర్ట్‌కు నెలకు రూ.85వేలు చెల్లిస్తారు. మార్చి 10న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rites.com
News February 20, 2026
ఎందుకలా?!: రక్తం ఎర్రగానే..

మానవుల్లో రక్తం ఎర్రగా ఉండటానికి ఎర్ర రక్తకణాలలో ఉండే హిమోగ్లోబిన్ అనే ప్రొటీన్ కారణం. ఇందులో ఉండే ఐరన్ ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను గ్రహించి శరీర భాగాలకు అందించేటప్పుడు ఎరుపు రంగులోకి మారుతుంది. శరీర భాగాలకు ఆక్సిజన్ అందించిన తర్వాత రక్తం ముదురు ఎరుపు రంగులోకి ఛేంజ్ అవుతుంది. బ్లడ్‌లో దాదాపు 55% ప్లాస్మా ఆ తర్వాత ఎక్కువగా ఎర్ర రక్తకణాలే ఉంటాయి. ప్రతిరోజూ 2pmకు ఇలా ఓ కొత్త విషయం ఎందుకలా?!లో.
News February 20, 2026
క్వాంటం కంప్యూటింగ్‌లో APదే పైచేయి.. AI సమ్మిట్‌లో చంద్రబాబు

AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొన్న AP CM చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం త్వరలోనే గూగుల్ వంటి సంస్థల రాకతో గ్లోబల్ AI డేటా హబ్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్మిస్తున్న క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచమంతా మాట్లాడుకునే రోజు వస్తుందన్నారు. ప్రపంచానికి అవసరమైన క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను APలోనే తయారు చేసేలా ఎకోసిస్టమ్‌ను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.


