News June 10, 2024
రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఆచారి..?
కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, జాతీయ బీసీ కమిషన్ మాజీ మెంబర్ తల్లోజు ఆచారి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది. ఆయన గత 40 ఏళ్లుగా బీజేపీలోనే కొనసాగుతున్నారు. పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సైతం పని చేసినట్లు అనుచరులు అంటున్నారు. పార్టీని నమ్ముకున్న ఆచారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారు.
Similar News
News January 12, 2025
MBNR: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలు.. APPLY చేసుకోండి
ఉమ్మడి జిల్లాలో గండీడ్, కోస్గి, కొత్తకోట, ధన్వాడ, వెల్దండ, కోడేరు, ఖిలా ఘనపూర్, పెబ్బేరు మండలాల్లో ఆదర్శ పాఠశాలలో ఉండగా.. 2025-26 విద్యా సంవత్సరానికి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 6వ తరగతికి నేరుగా..7,8,9,10వ తరగతిలో మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
SHARE IT
News January 12, 2025
MBNR: విద్యా నిధికి రూ.4,95,211 సాయం
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యా నిధి పథకానికి స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి రూ.4,95,211ల చెక్కు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి శనివారం సాయంత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని దానాల కన్నా విద్యాదానం ఎంతో గొప్పదని అన్నారు. జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. మహబూబ్ నగర్ రుణం తీర్చుకునే ఆకాశం వచ్చిందని అన్నారు.
News January 11, 2025
MBNR: ‘సంక్రాంతికి ఊరికెళ్తున్నారా.? ఇది మీకోసమే.!’
✓ విలువైన వస్తువులు, నగదు, నగలు ఇంట్లో ఉంచకపోవడం మంచిది.✓ ఊరికి వెళ్తున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టకండి.✓ ఇంటి ఆవరణలో లేదా ఏదైనా గదిలో లైటు వేసి ఉంచండి.✓ నమ్మకమైన వ్యక్తిని వాచ్‌మెన్‌గా పెట్టుకోవడం మంచిది.✓ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని వాటికి మొబైల్ అనుసంధానం చేసుకోవాలి.✓ ఇంటితాళం బయటకు కనిపించకుండా చూసుకోండి.✓ ఊరికి వెళ్లేముందు పోలీస్ స్టేషన్‌లో తెలపడం ఉత్తమం.