News January 7, 2026
రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యురాలిగా రామాంజనమ్మ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యురాలిగా లేపాక్షి మండలానికి చెందిన రామాంజనమ్మను TDP అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఆమెకు ఉత్తర్వులు అందాయి. రామాంజనమ్మ మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత. కాగా, ఆమె ZPTCగా కూడా పనిచేశారు. ఇటీవల TDPలో రాష్ట్ర మహిళా కమిటీలో కీలక పాత్ర పోషించారు. ఆమె సేవలను గుర్తించిన అధిష్ఠానం రామాంజనమ్మను ఏసీసీ కమిషన్ సభ్యురాలుగా ఎంపిక చేసింది.
Similar News
News January 26, 2026
GNT: గణతంత్ర వేడుకల బందోబస్తు పర్యవేక్షిస్తున్న ఎస్పీ

రాయపూడిలో జరుగుతున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల భద్రతా ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. సభావేదిక, గ్యాలరీలు, వీవీఐపీ ప్రాంతాలు, సీసీ కెమెరాలు, డ్రోన్ గస్తీపై సమీక్షించి అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు అమలు చేయాలని సూచించారు.
News January 26, 2026
సంగారెడ్డి: జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎస్పీ

77వ రిపబ్లిక్ డే సందర్భంగా సంగారెడ్డిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ జాతీయ జెండాను సోమవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదేనని చెప్పారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, స్వతంత్రం లభించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
News January 26, 2026
భారత్‌కు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు: జిన్‌పింగ్

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భారత్-చైనా మంచి స్నేహితులు, భాగస్వాములు అని పేర్కొన్నారు. కాగా 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణల తర్వాత 4 సంవత్సరాల పాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. 2024లో జరిగిన BRICS సదస్సుతో పాటు పలు ద్వైపాక్షిక సమావేశాలతో సంబంధాలు మెరుగయ్యాయి.


