News July 5, 2024

రాష్ట్ర గవర్నర్ OSDగా మంచిర్యాల జిల్లా వాసి

image

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ OSDగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన సిరిశెట్టి సంకీర్తన్ నియామకం అయ్యారు. ఆయన 2020లో IPS శిక్షణ పూర్తి చేసుకుని ములుగు, మధిర జిల్లాలకు ప్రొబెషనరీ IPSగా పని చేశారు. అనంతరం ఏటూరునాగారం ASPగా పనిచేసిన సంకీర్తన్ ఇటీవల గవర్నర్ OSDగా నియమితులయ్యారు. గవర్నర్ OSDగా బాధ్యతలు స్వీకరించడం పట్ల ఆయన తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News February 8, 2026

ADB: ఈ నెల 11న సెలవు

image

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఫిబ్రవరి 11 (బుధవారం)న స్థానిక సెలవు ప్రకటించినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలు జరిగే పురపాలక సంఘాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలు ఆ రోజున మూసివేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

News February 7, 2026

ఉట్నూర్: పట్టుపురుగుల పెంపకంపై అవగాహన కల్పించాలి

image

గిరిజన రైతులకు మల్బరీ పంట సాగుపై అలాగే పట్టుపురుగుల పెంపకంపై అవగాహన కల్పించి, గిరిజన రైతులకు మంచి ఆదాయం వచ్చేలాగా కృషి చేయడానికి ప్రయత్నం చేయాలని ITDA PO యువరాజ్ మర్మాట్ స్పష్టం చేశారు. శనివారం వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. మల్బరీ తోటల సాగుకు రైతులను ఎంపిక చేయాలని, వారికి కావలసిన రాయితీ వివరాలను వివరించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

News February 7, 2026

ఈ నెల 9న సా.5 గంటలకు ప్రచారం బంద్: ADB కలెక్టర్

image

మున్సిపల్ పోలింగ్‌కు 48 గంటల ముందు అంటే ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బహిరంగ సభలు, ఊరేగింపులు నిషేధమని, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే విధంగా సినిమాలు, టీవీ లేదా ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేయరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలతో పాటు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.