News January 14, 2026

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సంక్రాంతి విషెస్

image

AP: సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ పండుగ మీ జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పల్లె సీమలు ఆధునికతను సంతరించుకున్నా మన సంప్రదాయాలను మరచిపోకుండా పాటించాలని కోరుకుంటున్నాను. అందరికీ అనువైన పథకాలతో ప్రభుత్వం మరింత బాధ్యతతో వ్యవహరిస్తుందని హామీ ఇస్తున్నాను’ అని పేర్కొన్నారు.

Similar News

News February 21, 2026

RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>RITES<<>> లిమిటెడ్‌ 5 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BE/BTech(సివిల్ ఇంజినీరింగ్ ), B.Arch, PG(ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మేనేజ్‌మెంట్, ట్రాన్స్‌పోర్ట్ ఇంజినీరింగ్, ట్రాన్స్‌పోర్ట్ ప్లానింగ్)అర్హతతో పాటు పనిఅనుభవం గలవారు మార్చి 16వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. JGMకు నెలకు రూ.8OK-రూ.2.20L, DGMకు రూ.70K-2L,మేనేజర్‌కు రూ.50K-రూ.1.60L చెల్లిస్తారు.

News February 21, 2026

మామిడి: ఈ దశలో కాయ తొలిచే పురుగు ముప్పు మొదలు

image

మామిడి కాయలు నిమ్మ సైజు కంటే పెద్దవయ్యే దశ నుంచి కాయ తొలిచే పురుగులు కాయల తొడిమలు, రెండు కాయలు కలసి ఉన్నచోట గుడ్లు పెడతాయి. వీటి నుంచి వచ్చిన పురుగులు కాయలను తొలిచి తింటూ అవి పగిలి, రాలి పోవడానికి కారణమవుతాయి. ఈ పురుగులను గుర్తిస్తే లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్(50 ఇ.సి) 1ml మరియు వేప మందు (10,000 ppm) 2ML కలిపి పిచికారీ చేయాలి. పండుఈగ కట్టడికి ఎకరాకు 8-10 మిథైల్ యూజీనాల్ ట్రాప్స్ అమర్చాలి.

News February 21, 2026

తిరుమలలో నిత్యం కల్యాణమే..

image

తిరుమల శ్రీవారికి నిత్య కల్యాణం జరుగుతుంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి అర్చకులు రోజూ అత్యంత వైభవంగా వివాహం జరుపుతారు. భక్తుల దాంపత్య సౌఖ్యం కోసం ఈ సేవ నిర్వహిస్తారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఈ క్రతువు జరుపుతారు. ఈ కళ్యాణమహోత్సవం చూడడానికి భక్తులకు కన్నుల పండువగా ఉంటుంది. ఈ సేవలో పాల్గొన్న గృహస్థులకు స్వామివారి ఆశీస్సులతో పాటు వస్త్ర బహుమానం, ప్రసాదం లభిస్తాయి.