News November 7, 2025
రాష్ట్ర ప్రజల ప్రార్థనల వల్లే విశ్వవిజేతగా నిలిచాం: శ్రీచరణి

రాష్ట్ర ప్రజల మద్దతు, ప్రార్థనల వల్లే ఇండియా ఉమెన్స్ టీమ్ విశ్వవిజేతగా నిలిచిందని ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్ శ్రీచరణి అన్నారు. మంగళగిరిలో శుక్రవారం ఆమె మాట్లాడారు. తనకు రూ. 2.5 కోట్ల నగదు, గ్రూప్-1 ఉద్యోగం, కడపలో 1000 గజాల స్థలం కేటాయించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని చిన్నికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News November 7, 2025
జూబ్లీ ఉపఎన్నిక.. రూ.3.33 కోట్ల నగదు సీజ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు రూ.3.33 కోట్లు నగదు, 701 లీటర్ల మద్యం, ల్యాప్‌టాప్‌లు, వాహనాలు వంటి ఉచిత బహుమతులు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 7వ తేదీ ఉదయం వరకు మొత్తం 24 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయి. స్వేచ్ఛా యుతంగా, న్యాయంగా ఎన్నికలు జరగేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు కఠిన నిఘా కొనసాగిస్తున్నాయి.
News November 7, 2025
స్మశానాలకు దగ్గర్లో ఇల్లు ఉండవచ్చా?

స్మశానాలకు దగ్గర్లో ఇల్లు కట్టుకోవడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. స్మశానం నుంచి వెలువడే ప్రతికూల తరంగాలు నివాసితులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతారు. ‘దహన సంస్కారాలు జరిగే చోటు నుంచి కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు విడుదలై పర్యావరణం కాలుష్యమవుతుంది. ఈ గాలి ఆరోగ్యానికి హానికరం. నిరంతరం అశాంతి, నిరాశ భావాలను పెంచుతాయి’ అని సూచిస్తారు. <<-se>>#Vasthu<<>>
News November 7, 2025
HYD: ట్రబుల్ షూటర్ వచ్చేస్తున్నారు!

పితృవియోగంతో 10 రోజులు ప్రచారానికి దూరంగా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు మళ్లీ యుద్ధరంగంలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు దగ్గర పడుతుండడంతో, ట్రబుల్ షూటర్‌గా ఆయన ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. BRS జైత్రయాత్రను జూబ్లీహిల్స్ నుంచే మొదలు పెట్టేందుకు, హరీశ్ వ్యూహరచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


