News January 23, 2025
రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం..17వేల ఉద్యోగాలు

ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ Infosys HYDలో తమ ఐటీ క్యాంపస్ విస్తరించనుంది. ఘట్కేసర్ పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ నుంచి అదనంగా 17 వేల ఉద్యోగాలకు ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా అక్కడున్న సదుపాయాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇన్ఫోసిస్ సంస్థ మొదటి దశలో రూ.750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపింది.
Similar News
News March 1, 2026
ఈరోజు నమాజ్ వేళలు (01-3-2026) ఆదివారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.46 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.51 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.13 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.44 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.57 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 1, 2026
నాగిరెడ్డిపేటలో సినిమా షూటింగ్

నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గువ్వల చెరువు ఘాట్ అనే సినిమా షూటింగ్ నిర్వహించారు. సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని షూటింగ్‌ను తిలకించారు. సినిమా నిర్వాహక మేనేజర్ శ్యామ్ మాట్లాడుతూ.. వచ్చే నెల 8 వరకు ఇక్కడ షూటింగ్ ఉంటుందన్నారు.
News March 1, 2026
మార్చి 3న సింహాచలంలో దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు

చంద్ర గ్రహణం సందర్భంగా మార్చి 3న సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తునట్టు ఈఓ వెంకట్రావు శనివారం తెలిపారు. గ్రహణానంతరం సంప్రోక్షణ నిర్వహించి తిరిగి దర్శనాలకు భక్తులకు మరుసటి రోజు అనుమతిస్తామన్నారు. దర్శనాలతో పాటు ఆలయంలో జరిగే ఆర్జిత సేవలను కూడా రద్దు చేసినట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.


