News October 14, 2024

రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది : హోం మత్రి

image

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడడం జరిగిందన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. తుఫాన్ షెల్టర్లను సిద్ధం చేసామన్నారు. ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Similar News

News September 20, 2025

ఏయూలో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో MA, Mcom, MSC కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సంచాలకుడు డి.ఏ.నాయుడు తెలిపారు. ఈనెల 24 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, 26వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. ఏపీ పీజీ సెట్‌లో ర్యాంక్ సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫీజులు, కోర్సులు, తదితర వివరాలను వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.

News September 20, 2025

విశాఖ: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

విశాఖలో ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. పెందుర్తి పోలీసుల వివరాల ప్రకారం.. చెంగల్‌రావుపేటకు చెందిన బెహరా అబ్బాయి (65) ఇంట్లో క్లీనింగ్ చేస్తుండగా, ఇనుప రాడ్ ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ వైర్లకు తగిలింది. ఈ ఘటనలో ఆయన చేతులు, శరీరంపై పలుచోట్ల కాలి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News September 20, 2025

25న ఎంవీపీ కాలనీలో తపాలా డాక్ అదాలత్

image

తపాలా వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 25న ఎంవీపీ కాలనీ రీజనల్ కార్యాలయంలో 119వ తపాలా డాక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులను ఈ నెల 22వ తేదీ లోపు రీజనల్ కార్యాలయం చిరునామాకు సమర్పించాలని అధికారులు తెలిపారు.