News December 25, 2025
రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు: డీకే అరుణ

గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని ఎంపీ డికే అరుణ అన్నారు. బుధవారం నారాయణపేటలో నిర్వహించిన నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో గెలుపొందిన బీజేపీ సర్పంచ్ లను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వడం లేదని అన్నారు.
Similar News
News December 26, 2025
విజయవాడ రైల్వేస్టేషన్ విస్తరణ లేనట్లే..!

విజయవాడ రైల్వేస్టేషన్‌ను రూ.650 కోట్లతో అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. షాపింగ్ మాల్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లతో ఆధునీకరించినప్పటికీ, ప్రస్తుతం ఉన్న 10 ప్లాట్‌ఫారమ్‌లనే కొనసాగించనున్నారు. కొత్తగా ప్లాట్‌ఫారమ్‌లు పెరుగుతాయని ఆశించిన ప్రయాణీకులకు ఇది కొంత నిరాశ కలిగించే విషయమే. విజయవాడకు ప్రత్యామ్నాయంగా రాయనపాడు, గుణదల స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు.
News December 26, 2025
లిప్ లైనర్ వాడుతున్నారా?

లిప్‌స్టిక్ వేసుకొనేముందు లిప్ లైనర్ వాడటం ముఖ్యం. దీని వల్ల మీ లిప్‌స్టిక్ కిందికి, పైకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. అలాగే ఇది పెదాలకు సరైన షేప్ ఇస్తుందని చెబుతున్నారు. లైనర్‌తో పెదాల చుట్టూ ఔట్ లైన్ గీసి తర్వాత లిప్‌స్టిక్ వెయ్యాలి. లిప్‌స్టిక్ వేశాక తప్పనిసరిగా టిష్యూతో లిప్స్‌ని ప్రెస్ చేయండి. ఇది స్మడ్జింగ్, ఎక్స్‌ట్రా లిప్‌స్టిక్‌ని దూరం చేస్తుందని సూచిస్తున్నారు.
News December 26, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాస్త తగ్గిన చలి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి తీవ్రత కాస్త తగ్గింది. జగిత్యాల జిల్లా భీమారం మండలంలోని మన్నెగూడెంలో 10.8℃, మల్లాపూర్ మండలంలోని రాఘవపేటలో 10.8℃, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్‌లో 10.9℃, పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఆకెనపల్లిలో 11.1℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్ నగర్‌లో 11.2℃ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


