News December 23, 2024
రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్‌ను కలిసిన సెక్రటరీ
రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళిని సోమవారం సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సెక్రటరీ గుండా శ్రీనివాస్ కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీఈఎస్ సంస్థలను ఎక్స్టెన్సీ కేంద్రాలుగా మార్చేందుకు తీసుకుంటున్న చర్యల గురించి తెలిపారు. పాలీటెక్నిక్, ఎస్సీడబ్లుడీసీలలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, క్రీడలు, కళలు, సంగీతం, వ్యక్తిత్వ వికాసానికి చేస్తున్న కార్యక్రమాలను వెల్లడించారు.
Similar News
News December 24, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు
∆}దమ్మపేట: పాఠశాల ఎదుట ఆందోళన∆} బయ్యారం: ధాన్యం కొనుగోలు సందర్శించిన ఎమ్మెల్యే∆} చర్ల: ఇన్ఫార్మర్ నెపంతో యువకుడి దారుణ హత్య ∆}భద్రాద్రి జిల్లా: బాలికపై లైంగిక దాడి.. ఫోక్సో కేసు నమోదు∆}ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్∆}ఖమ్మం: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి∆} భద్రాచలం:అర్హులైన పేదలకు ఇందిరమ్మ:MLA∆} ఖమ్మం:’అంగన్వాడీలకు పెండింగ్ ఇంటి అద్దెలు ఇవ్వాలి’
News December 23, 2024
ఖమ్మంలో ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రం
ఖమ్మం జిల్లాలో సంతానం లేక బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జిల్లాలో ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటుచేస్తామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ శాసనమండలిలో ప్రకటించారు. కాగా ఇప్పటివరకు హైదరాబాద్‌లోని గాంధీ, పేట్ల బురుజు ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సేవలు అందుతుండగా ఇకపై ఖమ్మంలోనూ అందనున్నాయి. డబ్బు ఖర్చు చేసే స్తోమత లేని వారికి ప్రభుత్వ నిర్ణయం ఉపయోగకరం కానుంది.
News December 23, 2024
టీమిండియా ఆశా కిరణం భద్రాచలం అమ్మాయి
U-19 ఆసియా కప్ భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ గెలుపులో భద్రాచలం అమ్మాయి గొంగిడి త్రిష కీలక పాత్ర పోషించింది. 47 బంతుల్లో 52 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్ మాత్రమే కాదు టోర్నీ అంతా నిలకడగా ఆడి 159 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గాను ఎంపికైంది. త్రిష ఇలానే ఆడితే మున్ముందు సీనియర్ టీంకు ఎంపికవుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.