News July 18, 2024
రాష్ట్ర వైశ్య సంఘంలో జిల్లా వాసులకు చోటు ఇవ్వాలి: రాజేశ్

పార్వతిపురం జిల్లా వైశ్య సభ్యులకు రాష్ట్ర స్థాయి వైశ్య సంఘంలో చోటు కల్పించాలని టీడీపీ బీసీ సాధికారిక జిల్లా కో-ఆర్డినేటర్ కోరాడ రాజేశ్ కోరారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు వైశ్యులకు చేరాలన్నా, జిల్లా వైశ్య కుటుంబాలు సమస్యలు చెప్పాలన్నా రాష్ట్ర కమిటీలో జిల్లా వైశ్య సభ్యులకు చోటు కల్పించాలన్నారు. వైశ్యుల సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు.
Similar News
News December 15, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

➤కాశీబుగ్గ: ఈనెల 20న జాబ్ మేళా
➤ప్రజలను వైసీపీ తప్పుదోవ పట్టిస్తోంది: అచ్చెన్న
➤శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 46 అర్జీలు
➤అభ్యుదయ సైకిల్ యాత్రలో పాల్గొన్న అధికారులు
➤ఇచ్ఛాపురం: 6నెలలు గడిచినా బాధితులకు అందని న్యాయం
➤బొరిగివలసలో లైన్ మ్యాన్‌కు కరెంట్ షాక్
➤ధర్మాన వ్యాఖ్యలు హాస్యాస్పదం: ఎమ్మెల్యే శంకర్
News December 15, 2025
కాశీబుగ్గ: 600 ఖాళీలకు..జాబ్ మేళా

కాశీబుగ్గలోని శ్రీ సాయి శీరిషా డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో ఈనెల 20న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉరిటి సాయికుమార్ సోమవారం తెలిపారు. ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ జాబ్ మేళాలో 15 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని చెప్పారు. ఆయా కంపెనీల్లోని ఖాళీగా ఉన్న 600 ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, బిటెక్, ITI చదివిన అభ్యర్థులకు అవకాశం ఉంటుందన్నారు.
News December 15, 2025
ప్రజలను వైసీపీ తప్పుదోవపట్టిస్తుంది: మంత్రి అచ్చెన్న

వైసీపీ అబద్ధాలతోనే ఐదేళ్లు కాలక్షేపం చేసిందని, గ్రామాల్లో అభివృద్ధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుంచి ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. వారి పాలనలో రూ.లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కూటమి సంక్షేమం వైపు అడుగులేస్తుంటే ఓర్వలేక బూటకపు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.


