News February 18, 2025
రాష్ట్ర వ్యాప్తంగా వేములవాడ జాతర వాల్ పోస్టర్ల ప్రదర్శన

వేములవాడ రాజన్న సన్నిధిలో జరిగే మహాశివరాత్రి జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్లను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల వద్ద వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ సిబ్బంది అతికిస్తున్నారు. ఈనెల 25 నుంచి 27 గురువారం వరకు మూడు రోజులపాటు వేములవాడలో మహా శివరాత్రి జాతర జరుగుతుందన్నారు. పూజల వివరాలు, సమయాలతో కూడిన పూర్తి వివరాలతో వాల్ పోస్టర్లను రూపొందించామని తెలిపారు.
Similar News
News February 13, 2026
BREAKING.. ధర్మపురిలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్

జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. మొత్తం 15 వార్డులు ఉండగా, అన్నింటిలోనూ కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. ప్రత్యర్థి పార్టీలకు ఒక్క వార్డు కూడా దక్కలేదు. ధర్మపురి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కనిపించింది. ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటుండగా, ఈ విజయం జిల్లా రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది.
News February 13, 2026
రంగారెడ్డి జిల్లాలో ఇదీ పరిస్థితి..!

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లోని 126 వార్డుల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు 59 వార్డుల ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 24 కాంగ్రెస్, 23 BRS, 7 BJP, ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ BRS కైవసం చేసుకుంది. చేవెళ్లలో 4 INC, 4 BRS, 1 BJP గెలిచాయి. షాద్‌నగర్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. ఆమన్‌గల్లులో INC బోణీ చేయలేదు. శంకర్‌పల్లిలో హోరా హోరీ నడుస్తోంది.
News February 13, 2026
BRS MLA కౌశిక్ రెడ్డికి షాక్

TG: హుజూరాబాద్ BRS MLA పాడి కౌశిక్ రెడ్డికి షాక్ తగిలింది. హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డులకు 16 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ 8, బీజేపీ 5 స్థానాలకే పరిమితమైంది. మ్యాజిక్ ఫిగర్ సాధించిన కాంగ్రెస్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోనుంది.


