News October 20, 2025
రాష్ట్ర షూటింగ్ బాల్ టీమ్‌కు గద్వాల బిడ్డ కెప్టెన్

గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం జడ్పీహెచ్ఎస్ నందిన్నెలో చదువుతున్న మహేశ్వరి తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపికైంది. దీంతో ఆమెను ప్రధానోపాధ్యాయుడు విజయభాస్కర్, పీఈటీ అమ్రేష్ బాబు, తల్లిదండ్రులు అభినందించారు. మహేశ్వరి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మండల ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News October 20, 2025
త్వరలో వారికి ప్రత్యేక పింఛన్లు: మంత్రి కందుల

AP: రాష్ట్రంలోకి కళాకారులందరికీ త్వరలోనే ప్రత్యేక పింఛన్లను తిరిగి అందిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. గత ప్రభుత్వం కళాకారుల పింఛన్లను సాధారణ పింఛన్లకు జత చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని దుయ్యబట్టారు. త్వరలోనే నంది నాటకోత్సవాలు నిర్వహించి ఉగాది, కళారత్న పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. కళాకారుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఓ ప్రారంభ కార్యక్రమంలో చెప్పారు.
News October 20, 2025
దీపావళి రోజున దివ్వెలు ఎందుకు వెలిగించాలి?

దీపం సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం. సకల దేవతల నివాసం. దీపం వెలిగించిన చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అందుకే దీపం లేని ఇల్లు కళావిహీనమవుతుంది. దీపారాధన లేకుండా దీపావళి చేయరు. దీపపు కుందిలో బ్రహ్మ, విష్ణుమూర్తి ఉంటారు. ఈ వెలుగుల పండుగ రోజున వారే స్వయంగా ఇంట్లో వెలుగు నింపుతారు. దీపం సమస్త దేవతా స్వరూపం కాబట్టే వారిని ఆహ్వానించి, అనుగ్రహం పొందడానికి దీపావళి నాడు దీపాలు వెలిగించాలి.
News October 20, 2025
ప్రమాదాలు జరిగితే ఈ నంబర్లకు కాల్ చేయండి: SP

మతాబులు కాల్చేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ దామోదర్ ఆదివారం సూచించారు. చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే మతాబులు కాల్చాలని, పాత లేదా తడిసిన మతాబులు వినియోగించరాదని చెప్పారు. కాటన్ దుస్తులు ధరించాలనీ, నైలాన్ లేదా సింథటిక్ దుస్తులు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే 101, 100, 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.