News July 1, 2024
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రజా ప్రభుత్వ లక్ష్యం: డిప్యూటీ సీఎం
తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం చింతకాని, మధిర మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్డు
పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను
తమ ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు.
Similar News
News November 10, 2024
ఖాళీ స్థలాల యజమానులకు జిల్లా కలెక్టర్ హెచ్చరిక
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవడం, చెత్త వేయడం వల్ల దోమలు, కోతులతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఖాళీ ప్లాట్ లను యజమానులు శుభ్రం చేయకుంటే వెంటనే ప్రభుత్వ స్థలంగా బోర్డులు పెట్టాలని ఆదేశించారు. కూడలి ఉన్న ప్రదేశంలో చెత్త వేయకుండా ప్రజలలో అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు.
News November 10, 2024
చండ్రుగొండ : హాస్టల్లో పాము కలకలం
చండ్రుగొండ ఎస్సీ బాలుర వసతి గృహంలో పాము ప్రత్యక్షమైంది. హాస్టల్ బాత్రూంలో నుంచి పాము బయటకు వస్తున్న క్రమంలో స్థానికులు గుర్తించారు. ఆ సమయంలో హాస్టల్లో కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మిగతావారు పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ఇవ్వడంతో ఇళ్లకు వెళ్లినట్లు సమాచారం. అయితే హాస్టల్ పరిసర ప్రాంతం పిచ్చి మొక్కలు చెత్తాచెదారంతో నిండి ఉంటుందని స్థానికులు చెప్పారు. శుభ్రం చేయించాలని కోరారు.
News November 10, 2024
కచ్చితమైన సమాచారంతో వివరాలు నమోదు చేయాలి: జిల్లా కలెక్టర్
కులగణన సర్వే కోసం జారీ చేసిన బుక్ లెట్లోని మొత్తం అంశాలపై ఎలాంటి అనుమానాలు, సందేహాలకు తావు లేకుండా ప్రజల నుంచి కచ్చితమైన సమాచారం సేకరణతో నమోదులు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సర్వే ప్రక్రియను సూపర్‌వైజర్లు, మండల ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ బాధ్యులు సూపర్ చెక్ చేయాలని, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.