News February 25, 2026

రాష్ట్ర సేపక్ తక్రా పోటీల్లో కామారెడ్డి జట్టుకు ద్వితీయ స్థానం

image

వనపర్తి జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సేపక్ తక్రా పోటీల్లో కామారెడ్డి జిల్లా జట్టు ప్రతిభ కనబరిచి సీఎం కప్ సెకండ్ ఎడిషన్‌లో ద్వితీయ స్థానంలో సాధించింది. ఈ విషయాన్ని జిల్లా క్రీడాధికారి రంగా వెంకటేశ్వర్ తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు తుమ్మ రమేశ్, కార్యదర్శి కుమ్మరి నరేశ్, కోశాధికారి సతీశ్ జట్టు సభ్యులను అభినందించారు. క్రీడాకారుల కృషి, క్రమశిక్షణ ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు.

Similar News

News February 26, 2026

స్వీట్ క్రేవింగ్సా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి..

image

స్వీట్ క్రేవింగ్స్‌ కంట్రోల్‌కు బ్రష్ చేయడం ఒక మంచి మార్గమని న్యూట్రిషనిస్ట్‌లు చెబుతున్నారు. తీపి పదార్థాలు తినాలనే కోరిక మెదడులోని డోపమైన్ సిగ్నల్స్ వల్ల కలుగుతుంది. మనం బ్రష్ చేస్తే మింట్ ఫ్రెష్‌నెస్ ఆ సంకేతాలను అడ్డుకుని తినడం అయిపోయిందనే మెసేజ్‌ను బ్రెయిన్‌కు పంపుతుంది. ఇది మానసికమైన అలవాటును మార్చే ట్రిక్ మాత్రమే. ప్రోటీన్ లోపం లేదా నిద్రలేమి వల్ల వచ్చే క్రేవింగ్స్‌కు ఇది పరిష్కారం కాదు.

News February 26, 2026

నల్గొండ: రూ.43 కోట్ల ధాన్యం కుంభకోణం.. దంపతుల అరెస్ట్

image

ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి ఖజానాకు రూ.43 కోట్లు గండికొట్టిన కిలాడీల గుట్టును నల్గొండ పోలీసులు రట్టు చేశారు. కస్టమ్ మిల్లింగ్ పేరుతో 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పక్కదారి పట్టించిన కందుకూరి మహేందర్ దంపతులను అరెస్ట్ చేసి, నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News February 26, 2026

మా ఫోకస్ టీమ్‌ఇండియా కాదు: జింబాబ్వే స్టార్ ఇవాన్స్

image

T20 WC S-8లో భాగంగా భారత్‌తో నేడు జరగనున్న కీలక పోరుపై జింబాబ్వే స్టార్ బ్రాడ్ ఇవాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము టీమ్ఇండియాపై కాకుండా తమ సొంత ప్రణాళికపైనే ఫోకస్ పెట్టామని స్పష్టం చేశారు. భారత్ ప్రపంచంలోనే బెస్ట్ టీమ్స్‌లో ఒకటని.. అందుకే గ్రౌండ్‌లో 100% శ్రమించి ఆడతామని తెలిపారు. లెఫ్ట్ హ్యాండర్లతో నిండిన ఇండియా టాప్ ఆర్డర్‌ను కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్లాన్స్ ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.