News July 2, 2024
రాష్ట్ర స్థాయిలో తిరుపతికి 7, చిత్తూరుకు 22వ స్థానం

రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 8.30 గంటల వరకు జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో తిరుపతి జిల్లా 7, చిత్తూరు జిల్లాకు 22వ స్థానం దక్కిందని కలెక్టరేట్ అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 93.75 శాతం పెన్షన్లు పంపిణీ చేయగా, తిరుపతి జిల్లాలో 95.75 శాతం పెన్షన్లు పంపిణీ చేసి ఏడవ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టరేట్ అధికారులు తెలిపారు.
Similar News
News February 19, 2026
చిత్తూరు పూర్వ DMHOకు మెమో

కొవిడ్ 3వ దశ సన్నాహకాల్లో వైద్యుల నియామకం, హోం క్వారంటైన్ పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయని అప్పటి చిత్తూరు DMHO శ్రీహరిపై ఆరోపణలు వచ్చాయి. వీటిపై ప్రభుత్వం శాఖాపర చర్యలను ప్రారంభించింది. UPHCల్లో ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో, 183 మంది సపోర్టింగ్ సిబ్బందిని అవుట్‌సోర్సింగ్ ద్వారా నియమించామని శ్రీహరి రిప్లై ఇవ్వడంతో ఆ చర్యలను నిలిపేసింది. పారదర్శకంగా విధులు నిర్వహించాలని మెమో జారీ చేసింది.
News February 19, 2026
చిత్తూరు: వాటర్ ప్లాంట్లకు రూ.10లక్షలు

ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎంఈవోలతో ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.10 లక్షల మంజూరు చేస్తామని చెప్పారు. దీనికి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. పీఎం శ్రీ నిధులను మార్చిలోపు వినియోగించాలన్నారు. పనితీరు సక్రమంగా లేని HMలను మారుస్తామని హెచ్చరించారు.