News January 23, 2026
రాష్ట్ర స్థాయిలో బాపట్ల జిల్లా ఫస్ట్

గంజాయిని నివారించడంలో రాష్ట్రంలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కీ పెర్ఫామెన్స్ ఇండెక్స్‌లో 76.2 శాతంతో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. బాపట్ల జిల్లాలో ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసి పోలీసులతో కలిసి అవగాహన కార్యక్రమాలు, మెరుపు దాడులు నిర్వహిస్తూ ముందు వరసలో నిలపటం పట్ల ఈగల్ DIG రవికృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 7, 2026
NZB: అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలి: సుదర్శన్ రెడ్డి

ప్రగతి ప్రణాళిక అమలులో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు. NZB కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక అమలుపై సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో కూడిన అంశాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ఆసుపత్రుల సేవలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన పెంపొందించాలని పేర్కొన్నారు.
News March 7, 2026
ఖమేనీ పాలనలో దిగజారిన ఇరాన్ ప్రతిష్ఠ

ఖమేనీ మరణంతో ఇరాన్‌లో నాయకత్వ సంక్షోభం ముదిరింది. 1981 నుంచి అధికారంలో ఉన్న ఆయన పాలనలో ఆ దేశం అంతర్జాతీయ సూచీల్లో అట్టడుగుకు పడిపోయింది. 2025 అవినీతి సూచీలో 153వ స్థానం, పత్రికా స్వేచ్ఛలో 176వ స్థానంతో దారుణమైన స్థితికి చేరింది. ప్రజాస్వామ్యం, పౌర హక్కుల విషయంలోనూ నిరంకుశ పాలనలోనే ఉందని రిపోర్ట్స్ స్పష్టం చేశాయి. సుదీర్ఘ రాజకీయ స్థిరత్వం ఉన్నప్పటికీ సుపరిపాలన అందించడంలో ఖమేనీ విఫలమయ్యారు.
News March 7, 2026
ఈరోజు నమాజ్ వేళలు (07-3-2026) శనివారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.19 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.30 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ♦︎ అసర్: మధ్యాహ్నం 3.50 గంటలకు ♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.25 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.37 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


