News October 2, 2025

రాష్ట్ర స్థాయిలో స్వర్ణాంధ్ర అవార్డులు: కలెక్టర్ హర్షం

image

స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల నిర్వహణలో 1 రాష్ట్రస్థాయి, 49 జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. దేశంలోనే ఒక రాష్ట్రం 17 అవార్డు విభాగాలలో ఇటువంటి సమగ్ర శుభ్రత సర్వే నిర్వహించడం ఇదే తొలిసారి అని తెలిపారు. ఈ వివరాలను సాసా (SASA) పోర్టల్ https://sasa.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Similar News

News October 3, 2025

జిల్లాలో నేటి నుంచి 3వ పేజ్ రీ సర్వే: కలెక్టర్

image

జిల్లాలో నేటి నుంచి 3వ దశ రీ-సర్వే జిల్లాలో మొదలవుతుందని కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 221 గ్రామాలలో రీ-సర్వే పూర్తి చేశామని, మరో 22 గ్రామాలలో జరుగుతోందని అన్నారు. రైతులందరూ రీ-సర్వేకు సహకరించాలని కోరారు. రెవెన్యూ సిబ్బంది మీ భూమి సర్వే ఎప్పుడు చేస్తారో ముందుగా నోటీస్ ద్వారా తెలియజేస్తారని, ఆ సమయంలో రైతులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News October 2, 2025

శభాష్ తణుకు పోలీస్.. రెండు సంచలన కేసుల్లో పురోగతి

image

ఇటీవల తణుకులో సంచలనం రేకెత్తించిన రెండు ఘటనల్లో పోలీసులు పురోగతి సాధించారు. అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన యువకుడు బడుగుల సురేశ్ హత్య కేసును పోలీసులు చేధించారు. తణుకు వారణాసి వారి వీధిలో వృద్ధురాలు కనకదుర్గను చంపుతామని బెదిరించి 70 కాసుల బంగారం అపహరించిన కేసులో నిందితుడిని మహారాష్ట్రలో అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు విజయదశమి రోజున చేధించడం విశేషం.

News October 2, 2025

ఉండి: జీఎస్టీ 2.0 అవగాహన ర్యాలీ

image

ఉండి మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0 అవగాహన ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కలెక్టర్ నాగరాణి హాజరయ్యారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ సమీకృత వ్యవసాయ పరీక్షా కేంద్రం (ల్యాబ్)ను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.