News January 30, 2025

రాష్ట్ర స్థాయిలో హనుమకొండ బిడ్డ సత్తా చాటాడు

image

ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ హ్యాండ్ బాల్ పోటీల్లో హనుమకొండ నగరానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి కొప్పుల చరణ్ వరంగల్ జిల్లా తరఫున పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనబరిచాడు. ఈ పోటీల్లో వరంగల్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల ఇన్‌ఛార్జ్ కె.విద్యాకర్ అభినందించి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. 

Similar News

News March 2, 2026

సౌదీ సైలెంట్‌గా పావులు కదిపిందా?

image

ఇరాన్‌పై US దాడుల వెనుక సౌదీ అరేబియా ప్రిన్స్ సల్మాన్ హస్తం ఉందని వాషింగ్టన్‌పోస్ట్ కథనం వెల్లడించింది. ఇరాన్‌కు బహిరంగంగా మద్దతు తెలిపినా, దాడి చేయమని సల్మానే ట్రంప్‌ను ప్రోత్సహించి ఒప్పించినట్లు పేర్కొంది. షియా సిద్ధాంతాలు, ఇరాన్ ప్రభావం వ్యాపించకూడదని సౌదీ ప్లాన్ చేయగా.. తమ సరిహద్దుల్లో ఇరాన్ పోషిస్తున్న మిలిటెంట్ల బెడద తగ్గించుకోవడం సులువు అవుతుందని ఇజ్రాయెల్ ఇందుకు సహకరించినట్లు తెలుస్తోంది.

News March 2, 2026

చైనా ఆయుధాలు మరోసారి తుస్సు

image

చైనా డిజైన్ చేసిన ఆయుధాలు, డిఫెన్స్ సిస్టమ్స్ మరోసారి ఫెయిలయ్యాయి. వీటిని నమ్ముకునే US, ఇజ్రాయెల్ దాడులను ఇరాన్‌ ఎదుర్కొనేందుకు ప్రయత్నించి దెబ్బతింది. ఆ దేశం ఇచ్చిన HQ-9B డిఫెన్స్ సిస్టమ్ శత్రువుల మిసైళ్లను ఎదుర్కోలేకపోయింది. కొన్నింటిని అసలు గుర్తించలేకపోయింది. దీంతో ఇరాన్ భారీగా నష్టపోయింది. జనవరిలో వెనిజులా అధ్యక్షుడు మడురో, ఆపరేషన్ సిందూర్ టైమ్‌లో పాక్ సైతం చైనాను నమ్ముకొని దెబ్బతిన్నాయి.

News March 2, 2026

స్పేస్ రేస్ మళ్లీ మొదలైంది.. ఎందుకు? – 1/2

image

ఒకప్పుడు US, సోవియట్ యూనియన్‌లు అంతరిక్షంలో పైచేయి కోసం పోటాపోటీగా ప్రాజెక్టులు చేపట్టాయి. మూన్ ల్యాండింగ్‌పై నాసాకు పోటీగా చైనా కూడా ప్రాజెక్ట్ స్పీడప్ చేసినట్లు ప్రకటించడంతో మరోసారి ఇది తెరమీదకు వచ్చింది. 2028 నాటికి చంద్రుడిపైకి మనుషులను పంపాలని నాసా ప్లాన్ చేయగా.. చైనా ఈ టార్గెట్ 2030కి పెట్టుకుంది. మరోవైపు భారత్ సైతం 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి దింపాలని అనుకుంటోంది.