News April 13, 2025
రాష్ట్ర స్థాయి టాపర్‌గా ఆదర్శ రైతు కుమారుడు

కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన ఆదర్శ రైతు కారుమంచి షేక్ అహ్మద్ కుమారుడు షేక్ ఆసిఫ్ ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించారు. బైపీసీలో 440/430 మార్కులు సాధించి టాప్-10లో చోటుసాధించారు. విద్యార్థిని లెక్చరర్లు, కుటుంబ సభ్యులు అభినందించారు. ఆసిఫ్ మాట్లాడుతూ.. తండ్రి ఆశయాలకు అనుగుణంగా వైద్య విద్య పూర్తి చేసి గ్రామస్థులకు సేవలందిస్తానని చెప్పారు.
Similar News
News February 6, 2026
ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లు: డీఈవో

విద్యా హక్కు చట్టం ప్రకారం కర్నూలు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు బలహీన వర్గాల పిల్లలకు కేటాయించినట్లు డీఈఓ సుధాకర్ తెలిపారు. అర్హులైన వారు ఈనెల 20 నుంచి మార్చి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఆధార్ వివరాలతో cse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఐబీ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ వంటి అన్ని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లోనూ ఈ ప్రవేశాలు కల్పిస్తారు.
News February 5, 2026
కర్నూలు: CM పర్యటనకు భారీ బందోబస్తు

ఎమ్మిగనూరు(M) కలుగొట్లకు ఈనెల 6న సీఎం చంద్రబాబు రానున్న నేపథ్యంలో 1,200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేస్తున్నట్లు SP విక్రాంత్ పాటిల్ తెలిపారు. ముగ్గురు ASPలు, 8 మంది DSPలు, 55 మంది CIలు, 88 మంది SIలు, 297 మంది ASI, HCలు, 485 మంది PCలు, 61 మంది మహిళా పోలీసులు, 191 మంది హోంగార్డులు, 14 స్పెషల్ పార్టీ బృందాలు, 2 సెక్షన్ల AR పోలీసులు, బాంబ్ స్క్వాడ్, మఫ్టీ బృందాలను రంగంలోకి దింపినట్లు పేర్కొన్నారు.
News February 5, 2026
కర్నూలు జిల్లాలో యూరియా కొరత లేదు: వ్యవసాయాధికారి

కర్నూలు జిల్లాలో రబీ సీజన్‌కు యూరియా ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి స్పష్టం చేశారు. అవసరమైన నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే భారీగా సరఫరా జరిగిందని తెలిపారు. వేల మెట్రిక్ టన్నుల యూరియాను మార్క్‌ఫెడ్ గోదాములు, సొసైటీల్లో సిద్ధంగా ఉంచామన్నారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా లేదా ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.


