News January 30, 2025
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన జనగామ జిల్లా బిడ్డ

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని శివునిపల్లి జడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థి సాఫ్ట్ బాల్ క్రీడలో రాష్ట్ర పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం కుసుమ రమేశ్, పీటీ కొండ రవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గుగులోతు మధుసూదన్ అనే విద్యార్థి గత నవంబరులో వరంగల్‌లో జరిగిన జిల్లా స్థాయి 68వ స్కూల్ గేమ్స్‌లో పాల్గొని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వారు తెలిపారు.
Similar News
News November 11, 2025
నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

→ NLG: 13 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు
→ NLG: వే2న్యూస్ కథనానికి అధికారుల స్పందన
→ కేతేపల్లి: నార్కోటిక్స్ కట్టడిలో నల్గొండ పోలీస్ సంచలనం
→ NLG: వానాకాలం ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్
→ NLG: 4 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు అందని వేతనాలు
→ NLG: 50 శాతం సిలబస్ ఇంకా అలానే..
→ NLG: పంట పండింది.. సేకరణ ఇలా
→ MLG: రబ్బరులా ఇడ్లీ రవ్వ
→చిట్యాల : బస్సు దగ్ధం.. ప్రయాణికుల రియాక్షన్
News November 11, 2025
దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో లేకుండా త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ తహశీల్దార్లు, ఆర్డీవోలను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని మండలాల తహశీల్దార్లతో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యల నిమిత్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతిరోజు ప్రతి మండలం నుంచి కనీసం 50 దరఖాస్తులు పరిష్కరించాలన్నారు.
News November 11, 2025
జేఎన్ఎస్‌లో రెండో రోజు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

HNK జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ రెండో రోజు కొనసాగింది. నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 562 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. రన్నింగ్, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించగా 800 మంది ఉత్తీర్ణులయ్యారు. సోమవారం పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా జరిగింది.


