News October 18, 2024

రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానం: జిల్లా ఎస్పీ

image

కొత్తగూడెం: ఫ్లాగ్ డేను పురస్కరించుకొని రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ షార్ట్ ఫిలిం పోటీలను రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే ఇటీవలి కాలంలో తీసిన (3) ఫోటోలు, తక్కువ నిడివి (3ని.) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి అప్లోడ్ చేసిన పెన్ డ్రైవ్, 10 x 8 సైజ్ ఫోటోలను జిల్లా పోలీస్ పిఆర్వోకు అందజేయాలన్నారు.

Similar News

News February 21, 2026

ఖమ్మం: ‘ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు’

image

ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి 27 వరకు సార్వత్రిక పదో తరగతి, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో చైతన్యజైని తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలని ఆమె సూచించారు.

News February 21, 2026

ఖమ్మం రెవెన్యూ శాఖలో 15 మందికి పదోన్నతులు

image

ఖమ్మంలో రెవెన్యూ శాఖలో పదోన్నతులు పొందిన 15 మందికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నియామక పత్రాలు శుక్రవారం అందజేశారు. జవాబుదారీతనంతో పనిచేసి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని సూచించారు. డ్రాఫ్టింగ్, కంప్యూటర్ వినియోగంపై పట్టు సాధించాలని దిశానిర్దేశం చేశారు. ట్రెసా ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఒకేసారి 15 మందికి పదోన్నతులు రావడంతో శాఖలో ఉత్సాహం నెలకొంది.

News February 21, 2026

ఖమ్మం: బోనస్ సొమ్ముపై బ్యాంకుల ‘హోల్డ్’

image

ఖమ్మం జిల్లాలో ధాన్యం బోనస్ సొమ్ము రైతుల చేతికి అందకుండా బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 చొప్పున జమ చేసినా, పాత పంట రుణాల బకాయిల పేరుతో బ్యాంకులు ఆ ఖాతాలను ‘హోల్డ్’లో పెట్టాయి. దీంతో నగదు డ్రా చేసుకోలేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని వారు కోరుతున్నారు.