News April 18, 2025

రాహుల్‌గాంధీతో ఏఐఓబీసీఎస్‌ఏ సమావేశం

image

అఖిల భారత ఓబీసీ విద్యార్థులు సంఘం జాతీయ, తెలంగాణ, HCU కమిటీ నాయకుల బృందం శుక్రవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. ఏఐఓబీసీఎస్‌ఏ జాతీయ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రతినిధులు సమావేశమయ్యారు. రిజర్వేషన్ల అమలు, విశ్వవిద్యాలయాల్లో బోధనా ఉద్యోగాల నియమకాల్లో రోస్టర్‌ లోపాలు తదితర అంశాలు రాహుల్‌ గాంధీకి వివరించినట్లు తెలిపారు.

Similar News

News July 8, 2025

హైదరాబాద్: వైద్యశాఖలో ఉద్యోగాలు

image

హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (UPHCs) కాంట్రాక్ట్ పద్ధతిన 45 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హతగా MBBS డిగ్రీతో పాటు తెలంగాణ వైద్య మండలిలో నమోదు తప్పనిసరి. నెలవారీ వేతనం రూ.52,000 ఉంటుంది. దరఖాస్తులు 09-07-2025 నుంచి 11-07-2025 మధ్య సికింద్రాబాద్‌ ప్యాట్నీలోని జిల్లా ఆరోగ్యాధికారికి సమర్పించవచ్చు.
SHARE IT

News July 8, 2025

నకిలీ పత్రాలతో దరఖాస్తులు.. JNTU అనుమతులు!

image

కోదాడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్స్ కళాశాల నకిలీ ధ్రువపత్రాలతో అనుమతులు తీసుకుందని విజిలెన్స్ నివేదికలో తేలినా కౌన్సెలింగ్‌లో మరోసారి అనుమతి ఇవ్వడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ధ్రువపత్రాలతో అనుమతులు పొందుతున్న విద్యాసంస్థ నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అధికారులు సూచించినా ఇప్పటివరకు JNTU అధికారులు స్పందించకపోవడం గమనార్హం.

News July 8, 2025

HYD: యువతి కడుపులో పావలా కాయిన్!

image

25 ఏళ్లుగా యువతి కడుపులో ఉన్న పావలా కాయిన్‌ను గాంధీ ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేసి బయటకు తీశారు. సిటీకి చెందిన ఓ యువతి(28) తన మూడేళ్ల వయసులో తల్లి ఇచ్చిన పావలా కాయిన్‌ను మింగేసింది. ఇటీవల పోలీస్ ఉద్యోగానికై ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేస్తుండగా కడుపులోని కాయిన్ కారణంగా కడుపు నొప్పి కలిగింది. సదరు యువతి గాంధీలో అడ్మిట్ కాగా జనరల్ సర్జరీ వైద్యులు ఆపరేషన్ చేసి పావలా కాయిన్ , ఓ స్టోన్‌ను బయటకు తీశారు.