News February 11, 2026
రాహుల్ ఆరోపణలకు హర్దీప్ సింగ్ కౌంటర్

లోక్‌సభలో LoP రాహుల్ గాంధీ తనపై చేసిన <<19111987>>వ్యాఖ్యలన్నీ<<>> అబద్ధాలేనని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కొట్టిపారేశారు. ‘3 లక్షల ఈమెయిల్స్‌లో నా గురించి 4 లైన్లే ఉంది. మేకిన్ ఇండియా చర్చల్లో భాగంగా అతనితో పలుమార్లు భేటీ అయ్యా. మా మధ్య ఒక మెయిల్ సంభాషణే ఉంది’ అని అన్నారు. గతంలో రాహుల్ చేసిన ఓట్ చోరీ ఆరోపణలు కూడా అబద్ధమని తేలాయని పురి విమర్శించారు.
Similar News
News February 16, 2026
ఆగ్నేయ మూలలో వాస్తు దోషం ఉంటే?

ఆగ్నేయం దోషపూరితంగా ఉంటే కుటుంబంలో అశాంతి నెలకొనే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘కష్టపడి సంపాదించిన ధనం వృథా అయ్యే ఛాన్సుంది. రావలసిన డబ్బు సమయానికి అందదు. ఇంట్లో మహిళలు మానసిక వేదనకు, అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. కుటుంబీకుల మధ్య ఐక్యత లోపించి, నిరంతరం చిన్నపాటి గొడవలు జరుగుతుంటాయి. ఈ స్థలాన్ని వినియోగించుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 16, 2026
మగాళ్లలో టెస్టోస్టిరాన్ తగ్గితే?

పురుషుల వృషణాలలో, మహిళల అండాశయాలలో ఉత్పత్తి అయ్యే సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరాన్. కండరాల బలం, ఎముకల సాంద్రత, లైంగిక కోరిక, స్వరంలో మార్పు, సంతానోత్పత్తికి తోడ్పడుతుంది. అయితే జీవనశైలి మార్పులతో మగాళ్లలో టెస్టోస్టిరాన్ స్థాయులు తగ్గుతున్నాయి. అలసట, చికాకు, శృంగారంపై ఆసక్తి తగ్గడం, మజిల్ తగ్గి, కొవ్వు పెరగడం, మూడ్ స్వింగ్స్ దీని లక్షణాలు. బ్లడ్ టెస్టు ద్వారా టెస్టోస్టిరాన్ స్థాయులను తెలుసుకోవచ్చు.
News February 16, 2026
‘టెస్టోస్టిరాన్’ పెరగాలంటే?

* రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. 7-8 గంటలు నిద్రపోవాలి.
* ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయాలి.
* ప్రొటీన్లు ఎక్కువగా ఉండే చికెన్, చేపలు, బాదం, జీడిపప్పు, చియా సీడ్స్, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్ తీసుకోవాలి.
* ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
* డైలీ స్పూన్ మెంతులు నానబెట్టి తింటే టెస్టోస్టిరాన్ గణనీయంగా పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.


