News February 24, 2025
రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా గెలవరు: బండి

కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. MLC ఎన్నికల్లో ఓడిపోతున్నామని కాంగ్రెస్‌కు తెలిసిపోయిందని, ఏ సర్వే చూసినా విజయం BJPదేనని తేల్చడంతో కంగుతిన్న సీఎం రేవంత్ రెడ్డి తానే స్వయంగా ఎన్నికల్లో దిగి పైసలు పంచేందుకు సిద్ధమయ్యారన్నారు. రేవంత్ కాదు కదా…రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా MLC ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదన్నారు.
Similar News
News February 24, 2025
వరంగల్: నేటి ప్రజావాణి రద్దు

వరంగల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల, గ్రామాల ప్రజలు సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ రావద్దని ఆమె సూచించారు.
News February 23, 2025
బండి సంజయ్ కుమార్‌కు ఘన స్వాగతం

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా కేంద్రానికి వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌కు కొత్తవాడలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెసరు విజయ్ చందర్ రెడ్డి, నేతలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడి పని చేయాలని బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
News February 23, 2025
కేయూ పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన అన్ని పీజీ కోర్సులకు(రెగ్యులర్, సప్లిమెంటరీ) సంబంధించిన మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 3, 5, 7, 10, 12, 15 తేదీల్లో పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలను మధ్యాహ్నం 2 నుంచి సా.5 గంటల వరకు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.