News September 12, 2025

రింగ్ రైల్‌‌తో మారనున్న HYD రూపురేఖలు

image

సిటీలో ఇపుడు ఔటర్ రింగ్ రోడ్ 158 కిలో మీటర్లు.. ఆ తర్వాత రూ.362 రీజినల్ రింగ్ రోడ్.. దీని చుట్టూ రింగ్ రైల్ ప్రతిపాదనలు.. ఇవి అన్నీ పూర్తైతే నగర స్వరూపమే మారిపోతుంది. కొత్త కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, కాలేజీలు, మాల్స్ ఇలా ఎన్నెన్నో వస్తాయి. ఇదే జరిగితే దేశం మొత్తం సిటీవైపే చూస్తుంది. HYD అలా తయారుకావాలని మనమూ కోరుకుందాం. మీరేమంటారు?

Similar News

News September 12, 2025

గాంధీ ఆస్పత్రిలో బాధ్యతలు స్వీకరించిన డా.వాణి

image

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా అడిషనల్ DME ప్రొ.డా.వాణి కాసేపటి క్రితం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు పని చేసిన డా.రాజకుమారి గాంధీ మెడికల్ కాలేజీ ఫిజియాలజీ ప్రొఫెసర్‌గా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా డా.వాణి మాట్లాడుతూ.. గాంధీలో సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు.

News September 12, 2025

HYD: పార్టీ మారిన MLAలపై KTR కామెంట్స్

image

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ కామెంట్స్ చేశారు. పార్టీ మార్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేను రాహుల్ గాంధీతో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు స్వయంగా కలిశారని గుర్తు చేశారు. వారితో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో చూపించి, ఇవ్వాళ వీళ్లను మీరు గుర్తుపట్టగలరా? అని ఎద్దేవా చేశారు. BRS టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌లో చేరలేదు అంటున్నారన్నారు.

News September 12, 2025

HYD: గ్రూప్-1పై BJP మౌనమేల: కేటీఆర్

image

సీఎం రేవంత్ రెడ్డి, BJP మ‌ధ్య ర‌హ‌స్య మైత్రి కొన‌సాగుతుందని కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో నిప్పులు మండిపడ్డారు. చోటే భాయ్‌కి చీమ కూడా కుట్టకుండా బ‌డే భాయ్ పార్టీ బీజేపీ ప‌హారా కాస్తుంద‌ని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఎన్ని సమస్యలొచ్చినా.. రేవంత్ ఎన్ని స్కాములకు పాల్పడినా, బీజేపీ మాత్రం నొరుమెదపదెందుకు అని అన్నారు.