News September 12, 2025

రింగ్ రైల్‌‌తో మారనున్న HYD రూపురేఖలు

image

సిటీలో ఇపుడు ఔటర్ రింగ్ రోడ్ 158 కిలో మీటర్లు.. ఆ తర్వాత రూ.362 రీజినల్ రింగ్ రోడ్.. దీని చుట్టూ రింగ్ రైల్ ప్రతిపాదనలు.. ఇవి అన్నీ పూర్తైతే నగర స్వరూపమే మారిపోతుంది. కొత్త కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, కాలేజీలు, మాల్స్ ఇలా ఎన్నెన్నో వస్తాయి. ఇదే జరిగితే దేశం మొత్తం సిటీవైపే చూస్తుంది. HYD అలా తయారుకావాలని మనమూ కోరుకుందాం. మీరేమంటారు?

Similar News

News April 5, 2026

నీటి సంరక్షణ.. రేపటి నుంచి 100 రోజుల యాక్షన్ ప్లాన్

image

AP: నీటి సంరక్షణ-జలవనరుల పరిరక్షణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు 100 రోజుల(ఏప్రిల్ 6-జులై 14) కార్యాచరణను ప్రకటించారు. రేపు అనంతపురం(D) యాడికిలో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ‘చెరువులు, కాల్వలను క్లియర్ చేయాలి. నీటిని నిల్వ చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 8.7 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉన్నాయి. వర్షాకాలం తర్వాత 3 మీటర్ల లోతున నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలి’ అని CM అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News April 5, 2026

సామాన్య భక్తుడే ముఖ్యం: ఈవో శీనా నాయక్

image

ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తుల సంతృప్తే తమ ప్రధాన లక్ష్యమని దుర్గమ్మ ఆలయ ఈవో శీనా నాయక్ స్పష్టం చేశారు. సిబ్బంది భక్తులతో మర్యాదగా, చిరునవ్వుతో వ్యవహరించాలని సూచించారు. అన్నదానం, పూజా విభాగాలు అప్రమత్తంగా ఉండాలని, చట్ట నిబంధనలకు లోబడి పారదర్శక సేవలు అందించాలని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలందించడమే ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.

News April 5, 2026

హనుమకొండ: కాలువలో గల్లంతైన బీటెక్ స్టూడెంట్

image

కేయూ ఇంజినీరింగ్ కళాశాల వెనుక వైపు ఉన్న ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువలో ఈతకు వెళ్లిన బీటెక్ నాలుగో సంవత్సరం విద్యార్థి భూక్య వాసు గల్లంతయ్యాడు. డోర్నకల్‌కు చెందిన వాసు తన స్నేహితులతో కలిసి కాలువలోకి దిగి, ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న కేయూసీ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన విద్యార్థి కోసం గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు.