News August 25, 2025
రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా జరిగేందుకు కమిటీ సభ్యులు సహకరించాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదివారం పిలుపునిచ్చారు. అల్లర్లు, ఘర్షణలకు తావు లేకుండా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండపాలు ఏర్పాటు చేస్తున్న సభ్యులు https://ganeshutsav.netలో అనుమతులు పొందాలని సూచించారు.
Similar News
News August 25, 2025
శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లావ్యాప్తంగా సుమారు 6,51,645 రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పెద్ద సైజు కార్డులు బదులు QR కోడ్‌తో కూడిన ATM మాదిరి స్మార్ట్ రైస్ కార్డును రూపొందించారు. ఇందులో కార్డుదారుని ఫోటోతో సహా కుటుంబ సభ్యులు వివరాలు ఉంటాయి. సచివాలయా సిబ్బంది వీటిని అందజేస్తారు.
News August 24, 2025
SKLM: ‘వారి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణం’

గార(M) అంపోలులో దంపతుల <<17502057>>ఆత్మహత్య<<>> ఘటనపై జరుగుతున్న ప్రచారాన్ని అధికారులు ఖండించారు. పెన్షన్ నిలిచిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం ఆర్డీవో, గార తహశీల్దార్ విచారణలో ఈ విషయం బయటపడిందన్నారు. గ్రామస్థుల వాంగ్మూలం ప్రకారం.. కుటుంబ అంతర్గత ఆస్తి, ఇంటికి సంబంధిత వివాదాలే వారి మృతికి ప్రధాన కారణమని నిర్ధారించారు.
News August 24, 2025
SKLM: రేపు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.