News December 23, 2025
రికార్డుల రేసులో బంగారం, వెండి ధరలు..!

అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర ఇవాళ తొలిసారిగా ఔన్స్ $70 మార్కు తాకింది. అటు బంగారం ధర కూడా ఔన్స్‌కు $4,484 ఆల్-టైమ్ గరిష్ఠానికి చేరింది. సామాన్యులకు భారంగా మారుతున్నా, ఇన్వెస్టర్లకు మాత్రం పసిడి లాభాల పంట పండిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఓవరాల్‌గా 2025లో గోల్డ్ ₹60,550 (జనవరిలో 10గ్రా సగటున ₹78K ఉంటే నేడు ₹1,38,000) కేజీ వెండి ₹1.36లక్షలు పెరిగింది (JANలో ₹90K, ఇవాళ ₹2,34,000).
Similar News
News December 25, 2025
IBPS RRB PO పోస్టుల ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

IBPS ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 3,928 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల ఆన్సర్ కీని విడుదల చేసింది. స్కోరు కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు https://www.ibps.in/లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ నవంబర్ 22, 23 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.
News December 25, 2025
ఆయురారోగ్యాల జీవనం కోసం కొన్ని చిట్కాలు

రాత్రి వేళ నువ్వులతో చేసిన పదార్థాలను తినడం నిషిద్ధం. అలాగే, ఎప్పుడూ వివస్త్రుడై నిద్రించకూడదు. ఎంగిలి చేతితో ఇటు అటు తిరగకూడదు. భోజనానికి ముందు కాళ్లు కడుక్కుని, తడిగా ఉన్నప్పుడే భోజనం చేయాలి. దీనివల్ల శరీరంలోని ఉష్ణోగ్రత సమతుల్యమై దీర్ఘాయువు లభిస్తుంది. అయితే తడి కాళ్లతో మంచంపైకి చేరకూడదు. అది దారిద్ర్యానికి, అనారోగ్యానికి కారణమవుతుంది. ఈ చిన్న నియమాలు పాటిస్తే ప్రశాంతమైన జీవితాన్నిస్తాయి.
News December 25, 2025
వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ

వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పవిత్ర పర్వదినాన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలనుకుంటున్నారా? మీ ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభించి, సకల ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నారా? అయితే మీకు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ ఉత్తమమైనది. మీ పేరు, గోత్రనామాలతో జరిపించే సంకల్ప పూజ ద్వారా పాప విముక్తి పొంది, మోక్ష మార్గంలో పయనించవచ్చు. ఇప్పుడే వేదమందిర్‌లో మీ పూజను <


