News April 10, 2025
రికార్డుల స్కానింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి: కలెక్టర్

తహశీల్దార్ కార్యాలయంలో విద్యుత్తు మరమ్మత్తులతో పాటు ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. గురువారం వికారాబాద్ తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలోని ఫైల్స్ రికార్డు గదిని కలెక్టర్ పరిశీలించారు. పహానీల స్కానింగ్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
Similar News
News December 11, 2025
ఖమ్మం జిల్లాలో తొలి సర్పంచి విజయం

రఘునాథపాలెం మండలంలో ఓ సర్పంచ్ ఫలితం వెలువడింది. ఈరోజు జరిగిన ఎన్నికలో లచ్చిరాం తండాలో ప్రజలు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి మాలోతు సుశీల వైపు మొగ్గు చూపారు. 42 ఓట్ల తేడాతో సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
News December 11, 2025
18న గవర్నర్‌తో జగన్ భేటీ

AP: గవర్నర్‌తో YCP చీఫ్ YS జగన్ భేటీ తేదీ ఖరారైంది. ఈనెల 18న ఆయన గవర్నర్‌ను కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్ర ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాలను సమర్పిస్తారు. కాగా జగన్‌కు ఈనెల 17న గవర్నర్ అపాయింట్మెంటు ఇచ్చినప్పటికీ అనివార్య కారణాలతో దాన్ని 18కి వాయిదా వేసినట్లు తాజాగా లోక్‌భవన్ కార్యదర్శి లేఖ పంపారు. కాగా కోటి సంతకాల పత్రాలను YCP నేతలు విజయవాడకు తరలిస్తున్నారు.
News December 11, 2025
కామారెడ్డి జిల్లాలో 5 ఓట్ల తేడాతో తొలి విజయం

బిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామ సర్పంచిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భాగ్యమ్మ విజయం సాధించారు. తమ సమీప అభ్యర్థి లక్ష్మీపై ఐదు ఓట్ల తేడాతో భాగ్యమ్మ విజయం సాధించారు. దీంతో గ్రామంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. సర్పంచ్ స్థానం కోసం పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రచారం కొనసాగింది. చివరకు బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు.


