News June 4, 2024
రికార్డు బ్రేక్ దిశగా గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి

గుంటూరు జిల్లాలో టీడీపీ ఎంపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్ రికార్డులు బ్రేక్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన 195189 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఆయనకు ఇప్పటి వరకు 344736 ఓట్లు నమోదయ్యాయి. వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య 2,32,467 ఓట్లు నమోదయ్యాయి. కాగా గుంటూరు ఎంపీ పరిధిలో అన్ని నియోజకవర్గాలలో కూటమి స్పష్టమైన మెజారిటీ రావడంలో ఆయన పాత్ర ప్రత్యేకమైనది.
Similar News
News September 13, 2025
గుంటూరు: భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్

గుంటూరు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. సహాయం కోసం 0863-2234014 నంబరులో సంప్రదించాలన్నారు. మూడు షిఫ్టుల్లో సిబ్బందిని విధులు నిర్వహించేలా నియమించామని ఆమె పేర్కొన్నారు. ప్రజలు సమస్యలు తెలియజేస్తే అధికారులు వెంటనే సహాయం అందిస్తారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
News September 13, 2025
గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా వకుల్ జిందాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న సతీష్ కుమార్‌ను సత్యసాయి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. 2016 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో బాపట్ల ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం విజయనగరం జిల్లా నుంచి బదిలీపై గుంటూరుకు వస్తున్నారు. అక్కడ మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన, రోడ్డు ప్రమాదాల నివారణ, విద్యార్థులు, మహిళలకు రక్షణ వంటి చర్యలు విస్తృతంగా చేపట్టారు.
News September 13, 2025
పెదనందిపాడు: పిడుగుపాటుకు ఇద్దరు మహిళల మృతి

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామం సమీపంలో శనివారం విషాద ఘటన జరిగింది. అన్నపర్రు నుంచి కొప్పర్రు వెళ్ళే రహదారి పక్కన చేపల చెరువు దగ్గర పొలం పనులు ముగించుకుని వస్తుండగా పిడుగుపాటు సంభవించి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అన్నపర్రు గ్రామానికి చెందిన దేవరపల్లి సామ్రాజ్యం (రజిక), తన్నీరు నాగమ్మ (వడ్డెర)గా గుర్తించారు.