News September 23, 2025
రిజర్వేషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల ప్రక్రియపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల విధివిధానాలపై వారికి కలెక్టర్ దిశానిర్దేశం చేశారు
Similar News
News September 23, 2025
హన్మకొండ: పచ్చదనం విరిసి.. అవని మురిసి..!

అందమైన ప్రకృతి అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. చుట్టూ పంట పొలాలు, వాటి మధ్యలో గుట్టలు, ఎత్తైన తాటి చెట్లు, పంట పొలాల్లో పని చేస్తున్న రైతన్నలు, గొర్రెలను మేపుతున్న కాపరులు. ఇవన్నీ ఒకే చోట ఉంటే చూడటానికి రెండు కళ్లు సరిపోవనే చెప్పవచ్చు. అలాంటి దృశ్యం మన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ఎర్రబెల్లి గ్రామ శివారులోని ఇనుపరాతి గుట్టల వద్ద కనివిందు చేస్తోంది. అచ్చం ఓ చిత్రకారుడు గీసిన చిత్రలాగే ఉంది.
News September 23, 2025
టేక్మాల్: అక్రమంగా తరలిస్తున్న యూరియా పట్టివేత

అక్రమంగా యూరియాను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని మెదక్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ కృష్ణమూర్తి తన సిబ్బందితో కలిసి దాడి చేసి వాహనంలో ఉన్న 250 యూరియా సంచులను సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
News September 23, 2025
దిలావర్పూర్: మాతాన్నపూర్ణ దేవిగా పార్వతీదేవి

దిలావర్పూర్ మండలం కదిలి మాత అన్నపూర్ణేశ్వరి ఆలయానికి విశిష్ఠ చరిత్ర ఉంది. పార్వతీదేవి శివుడితో కలిసి ఈ స్థలంలో మాత అన్నపూర్ణేశ్వరిగా కొలువై ఉంది. దక్షిణం వైపు ముఖం కలిగి అమ్మవారు కొలువయ్యారు. అందుకే ఇక్కడ ఏడాది పొడుగునా అన్నదానం నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులలో ఇక్కడ హోమాలు, పూజలు చేయడంతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు దర్శించుకుంటారు. 9 రోజులు నిష్ఠతో పూజలు ఆచరిస్తారు.