News February 9, 2026
రిజర్వేషన్ల లెక్కలతో పల్లెల్లో రాజకీయ హడావిడి

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఏప్రిల్‌లో పాలకవర్గాల గడువు ముగియనుండటంతో మార్చి 9 లోగా ఓటర్ల జాబితా పూర్తిచేయాలని అధికారులు ఆదేశించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 1000కి పైగా పంచాయతీల్లో అప్పుడే రాజకీయ సందడి మొదలైంది. రిజర్వేషన్ల కేటాయింపుపై పల్లెల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. పోటీకి సిద్ధమయ్యే అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
Similar News
News April 5, 2026
మహబూబ్ నగర్ జిల్లా.. నేటి ముఖ్యంశాలు!

@మహబూబ్ నగర్ జిల్లాల్లో కొనసాగుతున్న ఎండల తీవ్రత
@మహమ్మదాబాద్ లో బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభం
@ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
@దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
@భూత్పూర్: 44వ జాతీయ రహదారిపై దారి బోల్తా- డ్రైవర్ కు గాయాలు
@అడవి పంది దాడిలో గాయపడ్డ రైతు మృతి
@రాజాపూర్ మండల కేంద్రంలో.. చలివేంద్రంను ప్రారంభించిన సర్పంచ్
News April 4, 2026
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రధానికి బాధితుల లేఖ

గతేడాది అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులు 30 మంది ప్రధాని మోదీకి లేఖ రాశారు. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ ఫ్లైట్ డేటా రికార్డర్ డేటాను విడుదల చేయాలని కోరారు. బహిరంగంగా కుదరకపోతే తమకైనా ఆ వివరాలు ఇవ్వాలన్నారు. విమానం ఎందుకు కూలిందో తాము తెలుసుకోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఫ్లైట్‌లోని 242 మందికి గాను 241 మంది, 19 మంది ఇతరులు మరణించిన విషయం తెలిసిందే.
News April 4, 2026
రాజేంద్రనగర్‌లో హైకోర్టు భవనానికి శంకుస్థాపన

రాజేంద్రనగర్‌లో తెలంగాణ హైకోర్టు జోన్-II భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పాల్గొన్నారు. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఆయనకి గణస్వాగతం పలికారు. CS కె.రామకృష్ణారావు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ తదితరులు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చారు.


