News November 24, 2025
రియల్ కంపెనీలపై ఈడీ రైడ్స్ కలకలం

హైదరాబాద్‌లోని 8 రియల్ ఎస్టేట్ కంపెనీలపై ED దాడులు చేసింది. జయత్రి, జనప్రియ, రాజా డెవలపర్స్, శ్రీ గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్టక్షన్స్ తదితర కంపెనీల్లో అగ్రిమెంట్స్, హార్డ్ డ్రైవ్స్ సహా పలు డాక్యుమెంట్స్, డిజిటల్ అసెట్స్ సీజ్ చేశారు. ప్రి లాంఛ్ పేరుతో కస్టమర్స్ నుంచి జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రూ.60 కోట్లు తీసుకుని షెల్ కంపెనీలకు మళ్లించిందని వచ్చిన కంప్లైంట్స్‌పై ఈ రైడ్స్ జరిగాయి.
Similar News
News November 25, 2025
ALERT.. వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

AP: మలక్కా జలసంధి ప్రాంతంలోని తీవ్ర అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడిందని APSDMA తెలిపింది. ఇది నెమ్మదిగా కదులుతూ రాబోయే 48 గంటల్లో మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. తుఫాను ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయంది.
News November 25, 2025
జనవరి నుంచి కొత్త డిస్కం.. నేడు నిర్ణయం

తెలంగాణలో జనవరి 2026లో కొత్త విద్యుత్ డిస్కం ఏర్పాటుపై ఈ మధ్యాహ్నం క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనుంది. దీంతో ఇప్పటికే రూ.59,671 కోట్ల నష్టాల్లోని TGSPDCL, TGNPDCLలపై సబ్సిడీ సరఫరా భారం తగ్గనుంది. వ్యవసాయానికి ఫ్రీ కరెంట్, పేదలకు 200 యూనిట్లు ఫ్రీ, మిషన్ భగీరథ & HYD వాటర్ బోర్డు కొత్త డిస్కంలో ఉంటాయి. దీంతో పాటు మరిన్ని విద్యుత్ సంస్కరణలు నేటి భేటీలో చర్చకు వస్తాయని సమాచారం.
News November 25, 2025
భారత్‌కు తొలి మహిళా వరల్డ్ స్నూకర్ టైటిల్

చెన్నైకి చెందిన 23 ఏళ్ల అనుపమ రామచంద్రన్ ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌గా అవతరించారు. చెన్నైలోని విద్యా మందిర్ స్కూల్‌లో చదివిన అనుపమ, ప్రస్తుతం ఎంఓపీ వైష్ణవ్ కాలేజీలో పబ్లిక్ పాలసీలో పీజీ చేస్తున్నారు. జూనియర్ స్థాయిలో 8 జాతీయ టైటిళ్లు, అమీ కమానీతో కలిసి 2023లో ఉమెన్స్ స్నూకర్ వరల్డ్ కప్, అండర్-21 ప్రపంచ టైటిల్‌ను కూడా కైవసం చేసుకున్నారు. మహిళల విభాగంలో భారత్‌కు ఇదే మొట్టమొదటి ప్రపంచ స్నూకర్ టైటిల్.


