News February 17, 2026
‘రియల్’ దూకుడు.. తగ్గేదేలే!

దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి రూ.88 లక్షల కోట్లకు చేరనుందని KPMG-నరెడ్కో కన్సల్టెన్సీ సంస్థలు తెలిపాయి. గతేడాదితో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. అప్పుడప్పుడు ఆటుపోట్లు ఎదురైనా 2047 నాటికి మరింత పెరిగి రూ.616.7 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని ‘ది రోల్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఇన్ వికసిత్ భారత్-2047’ నివేదికలో వెల్లడించాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రియల్ రంగం వెన్నెముకగా మారనుందన్నాయి.
Similar News
News February 17, 2026
అణు చర్చల వేళ హార్ముజ్‌లో ఇరాన్ యుద్ధ విన్యాసాలు

అణు ఒప్పందంపై USతో చర్చలు ప్రారంభమైన వేళ ఇరాన్ తన సైనిక బలాన్ని ప్రదర్శించింది. హార్ముజ్ జలసంధి లక్ష్యంగా ‘రెవల్యూషనరీ గార్డ్’ లైవ్-ఫైర్ విన్యాసాలు చేపట్టింది. తీర ప్రాంతం నుంచి ప్రయోగించిన మిస్సైల్స్ జలసంధిలోని లక్ష్యాలను తాకినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా ఉండే ఈ జలమార్గంలో విన్యాసాలు చేయడం ద్వారా ఇరాన్ ప్రపంచ దేశాలకు బలమైన సంకేతాలు పంపింది.
News February 17, 2026
BREAKING: ఐబొమ్మ రవికి బెయిల్

TG: ఐబొమ్మ నిర్వాహకుడు రవికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి రోజూ ఉ.11 గంటలకు సీపీఎస్ పోలీసుల ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. దేశం విడిచి వెళ్లొద్దని, పాస్ పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. కోర్టు అనుమతితోనే ఇంటర్నెట్ వాడాలని తేల్చిచెప్పింది. సినిమాల పైరసీ కేసులో గతేడాది నవంబర్ 16న రవి అరెస్టయిన విషయం తెలిసిందే.
News February 17, 2026
100 ఎకరాల్లో జినోమ్ వ్యాలీ ఫేజ్-4: శ్రీధర్ బాబు

TG: జినోమ్ వ్యాలీని విస్తరిస్తూ ఫేజ్-4ను 100 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘లైఫ్ సైన్సెస్ రంగంలో 2035 నాటికి $25B పెట్టుబడుల లక్ష్యంగా ప్లాన్ రూపొందించాం. Trident AI కంపెనీ (US) ₹300CR, Rx Propellant ₹1000CR పెట్టుబడి పెడుతున్నాయి. Opella (France) కంపెనీ ముందుకొచ్చింది. AI ఆధారిత డ్రగ్స్ డిస్కవరీలో యువతకు శిక్షణ ఇప్పిస్తాం’ అని బయో ఆసియా-2026 సదస్సులో తెలిపారు.


