News December 11, 2024
రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్: వైయస్ జగన్
జమ్మూలో విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన ఆర్మీ జవాన్ వరికుంట్ల సుబ్బయ్య రియల్ హీరో అని మాజీ సీఎం జగన్ కొనియాడారు. సుబ్బయ్య ల్యాండ్‌మైన్ ఉచ్చు నుంచి తనతోటి జవాన్‌లు 30 మందిని కాపాడడం స్ఫూర్తిదాయకమని అన్నారు. తన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని, తన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ‘X’లో పోస్టు చేశారు.
Similar News
News December 26, 2024
REWIND: ‘ప్రకాశం జలప్రళయానికి 35 మంది బలి
సునామీ ఈ పేరు వింటేనే ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 26న ప్రకాశం జిల్లాలో సునామీ పంజా విసిరింది. ఈ ధాటికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 35 మంది మృతి చెందారు. కళ్లెదుటే కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న పరిస్థితులను ఇప్పుడు తలచుకుంటే.. ఆ భయం అలానే ఉందని జిల్లా వాసులు పేర్కొంటున్నారు.
News December 25, 2024
ఎందుకింత కక్ష…? చంద్రబాబు: ఎమ్మెల్యే తాటిపర్తి
ఎందుకింత కక్ష చంద్రబాబు అంటూ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ‘కేవలం వైఎస్ జగన్ హయాంలో నియమితులైనవారని సచివాలయ వ్యవస్థపైన కక్ష గట్టి వారి జీతానికి బయోమెట్రిక్ అటెండెన్స్ లింక్ చేశారు. నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ రంగంలోని అన్ని శాఖల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేయగలరా?, ఈ వయసులో కడుపు మంట ఎందుకు?’ అంటూ Xలో పోస్ట్ చేశారు.
News December 25, 2024
ప్రకాశంలో మొదటి సారి భూ ప్రకంపనలు ఎప్పుడు వచ్చాయంటే?
ప్రకాశం జిల్లాలోని తాళ్ళూరు, ముండ్లమూరు మండలాల్లో గత మూడు రోజులుగా 7 సార్లు భూ ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మన జిల్లాలో 1800వ సంవత్సరం నుంచి తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా 1905, 2016, 2021, 2023లో ఒంగోలు, బల్లికురవలో భూమి కంపించింది. మైనింగ్, భూగర్భజలాలు తోడేయడం భూప్రకంపనలకు కారణం అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది