News December 12, 2024
రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్: వైయస్ జగన్

జమ్మూలో విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన ఆర్మీ జవాన్ వరికుంట్ల సుబ్బయ్య రియల్ హీరో అని మాజీ సీఎం జగన్ కొనియాడారు. సుబ్బయ్య ల్యాండ్‌మైన్ ఉచ్చు నుంచి తనతోటి జవాన్‌లు 30 మందిని కాపాడడం స్ఫూర్తిదాయకమని అన్నారు. సుబ్బయ్య కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని, అతని ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ‘X’లో పోస్టు చేశారు.
Similar News
News October 28, 2025
ప్రకాశం జిల్లాలో పునరావాసాలకు 2900 మంది

తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 65 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 2900 మందిని తరలించినట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ మంగళవారం సాయంత్రం ఒంగోలులోని కలెక్టరేట్‌లో మాట్లాడుతూ.. ఒంగోలు నగరంలో 30 లోతట్టు కాలనీలను గుర్తించామని, కోస్తా మండలాల్లో 10 లోతట్టు ఆవాస ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. 2 రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 28, 2025
ప్రకాశం: ‘గర్భవతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి’

గర్భవతులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సుధా మారుతి తెలిపారు. తుఫాన్ ప్రభావం వల్ల గర్భవతులు అప్రమత్తంగా ఉండాలని, డెలివరీ తేదీకంటే ముందుగానే హాస్పిటల్‌లో చూపించుకోవాలని తెలిపారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని అంగన్వాడీలు స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరిశీలించడం జరుగుతుందన్నారు. చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 28, 2025
ప్రకాశం: జాతీయ రహదారులపై రాకపోకలు నిషేధం

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని జాతీయ రహదారుల్లో భారీ వాహనాల రాకపోకలను రాత్రి 7 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు SP హర్షవర్ధన్ రాజు ప్రకటన విడుదల చేశారు. అలాగే జాతీయ, రాష్ట్ర రహదారుల్లో వాహనాల ప్రయాణం నిషేధించడం జరిగిందని, ప్రజా రక్షణ నిమిత్తం తీసుకున్న నిర్ణయాన్ని వాహనదారులు పాటించాలని ఎస్పీ సూచించారు.


