News April 29, 2024

రిలే ఆసియా జూనియర్ అథ్లెటిక్స్‌లో నాగర్‌కర్నూల్ బిడ్డకు గోల్డ్ మెడల్

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన సంగీత దుబాయ్‌లో జరిగిన 400 మీటర్ల రిలే ఆసియా జూనియర్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం సాధించింది. వరల్డ్ వైడ్ దుబాయ్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఇండియాకు బంగారు పతకం సాధించడం ఇదే తొలిసారి. సంగీత తండ్రి శ్యామ్ జిల్లా ఎస్పీ ఆఫీసులో వైర్లెస్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు.

Similar News

News December 28, 2024

రాష్ట్ర స్థాయికి మహబూబ్‌నగర్ జిల్లా జట్టు

image

హైదరాబాద్ గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ హాకీ టోర్నమెంట్లో రెండో రోజు మహబూబ్‌నగర్ జిల్లా హాకీ జట్టు సెమీఫైనల్‌కి చేరింది. రెండవ రోజు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా జట్లతో క్రీడాకారులు అత్యున్నత మైన ప్రదర్శన కనబరిచి విజయం సాధించి సెమీ ఫైనల్స్‌కి అర్హత సాధించారు. రేపు నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల జట్లు సెమీఫైనల్‌లో పోటీ పడతాయని నిర్వాహకులు తెలిపారు. 

News December 28, 2024

నేటి నుంచి APGVB సేవలు బంద్

image

ఆంధ్రప్రదేశ్ గ్రామీ వికాస్ బ్యాంక్(APGVB) తెలంగాణ గ్రామీణ బ్యాంకు(TGB)లో విలీనం కానుంది. 2025 JAN1 నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి 31 వరకు బ్యాంకింగ్ సేవల (UPI, ATM, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, AEPS, CSP) తాత్కాలికంగా అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని పాలమూరు జిల్లా బ్యాంకు అధికారులు కోరారు. ఈ బ్యాంకుకు ఉమ్మడి పాలమూరులో 85 బ్రాంచ్‌లు ఉన్నాయి. 

News December 28, 2024

MBNR: నేటి నుంచి ఉచిత శిక్షణ.. సద్వినియోగం చేసుకోండి

image

‘సీసీటీవీ కెమెరా ఇన్సలేషన్& సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ, భోజనం, వసతి కల్పిస్తున్నట్లు ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. నేటి నుంచి 13 రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. MBNR, NGKL, GDWL, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు చెందిన గ్రామీణ యువత సద్వినియోగం చేసుకోవాలని, ఈ శిక్షణ మహబూబ్ నగర్ లోని బండమీదిపల్లి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కార్యాలయంలో ఉంటుందన్నారు.