News November 5, 2025
రిహ్యాబిలిటేషన్ సెంటర్‌లో చేరిన స్టార్ క్రికెటర్

T20 WC ఆఫ్రికా క్వాలిఫయర్స్‌కు స్టార్ బ్యాటర్ షాన్ విలియమ్స్ అందుబాటులో ఉండరని జింబాంబ్వే క్రికెట్ ప్రకటించింది. యాంటీ డోపింగ్, క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతని సెంట్రల్ కాంట్రాక్ట్ రెన్యూవల్ చేయట్లేదని తెలిపింది. అతను డ్రగ్ అడిక్షన్‌తో ఇబ్బంది పడుతూ రిహ్యాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లినట్లు ఒప్పుకున్నారని తెలిపింది. విలియమ్స్ అన్ని ఫార్మాట్లలో కలిపి 56 హాఫ్ సెంచరీలు, 14 శతకాలు సహా 8968 రన్స్ చేశారు.
Similar News
News November 5, 2025
ఉపరితల ఆవర్తనంతో ఈ జిల్లాల్లో వర్షాలు!

కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ APలోని కోనసీమ, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, NLR, కర్నూలు, కడప, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలో ఇవాళ్టితో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో వర్షాలు ముగుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
News November 5, 2025
నేడు తులసి పూజ ఎందుకు చేయాలి?

కార్తీక పౌర్ణమి రోజునే తులసీ మాత భూమిపైకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు తప్పకుండా తులసికి గంగాజలంతో పూజ చేయాలంటారు పండితులు. ఫలితంగా భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. తులసి కోట వద్ద దీపారాధన చేసి, దీపదానం చేస్తే.. లక్ష్మీ దేవి సంతోషించి, కటాక్షాన్ని ప్రసాదిస్తుందట. అంతేకాక, పసుపు పూసిన నాణాన్ని ఎరుపు వస్త్రంలో ఉంచడం వలన కుటుంబంలో సంపదలు పెరిగి, అందరూ ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం.
News November 5, 2025
అనూరాధ కార్తెలో అనాథ కర్రయినా ఈనుతుంది

అనూరాధ కార్తె(నవంబర్) సమయంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఈ కాలంలోని అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా వర్షాలు, వ్యవసాయానికి ఎంతగానో తోడ్పడతాయి. సాధారణంగా ఫలవంతం కాని లేదా పనికిరాని మొక్క (కర్ర) కూడా ఈ కార్తెలో విపరీతమైన దిగుబడిని ఇస్తుందని.. ఈ సమయంలో రైతులు మంచి పంట దిగుబడిని ఆశించవచ్చనే విషయాన్ని ఈ సామెత నొక్కి చెబుతుంది.


