News April 13, 2025
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ 22వరకు అవకాశం..DIEO

రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు 13 నుంచి 22వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సోమశేఖరరావు తెలిపారు. సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ మే 12 నుంచి 20 వరకు జరుగుతాయన్నారు. బెటర్మెంట్, పరీక్ష తప్పిన వారు ఫీజు చెల్లించేందుకు 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు మే 28 నుంచి జూన్ 1 వరకు జిల్లా ముఖ్య కేంద్రాల్లో జరుగుతాయని సోమశేఖరరావు తెలిపారు.
Similar News
News February 22, 2026
నాసా మూన్ మిషన్ వాయిదా!

చంద్రుడిపైకి మనుషులను పంపే నాసా ‘ఆర్టెమిస్-2’ ప్రయోగం వాయిదా పడినట్లే! మార్చి 6న జరగాల్సిన ఈ మిషన్‌లో కొత్తగా హీలియం లీకేజీ తలెత్తింది. దీంతో భారీ SLS రాకెట్‌ను లాంచ్ ప్యాడ్ నుంచి తిరిగి హ్యాంగర్‌కు తరలించనున్నారు. ఇంధన ట్యాంకుల ప్రెజర్‌కు అవసరమైన హీలియం ఫ్లోలో అంతరాయమే దీనికి కారణం. టెక్నికల్ ఇష్యూస్‌ను సరిదిద్దేందుకు టైమ్ పడుతుండటంతో మార్చిలో ఈ ప్రయోగం జరిగే అవకాశం లేదని నాసా తెలిపింది.
News February 22, 2026
కర్నూలులో జిల్లాలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు

కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు 810 ఓవర్ స్పీడ్, 642 హెల్మెట్ లేని కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. 270 సెల్ ఫోన్ డ్రైవింగ్, 1,187 డ్రంక్ అండ్ డ్రైవింగ్, 2,137 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదయ్యాయన్నారు.
News February 22, 2026
వర్షం దెబ్బ.. పాకిస్థాన్ సెమీస్ లెక్కలు తలకిందులు!

కొలంబోలో శనివారం పాక్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన సూపర్-8 మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన విషయం తెలిసిందే. రిజర్వ్ డే లేకపోవడంతో ఇరు జట్లు పాయింట్లను పంచుకున్నాయి. దీంతో పాక్ సెమీస్ చేరాలంటే తర్వాతి 2 మ్యాచుల్లో ఇంగ్లాండ్, శ్రీలంకపై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క మ్యాచ్ ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకే ఒక్క పాయింట్‌తో సల్మాన్ అలీ ఆఘా సేన సెమీస్ పోరు క్లిష్టంగా మారింది.


