News March 24, 2024
రీపోల్ అవసరమే రాని ఎన్నికలే లక్ష్యం: కలెక్టర్

ఎన్నికలు తిరిగి నిర్వహించే అవసరం రాకుండా (జీరో వయలెన్స్.. నో రీపోల్), పూర్తి స్వేచ్ఛగా, సజావుగా ఈ దఫా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తున్నదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలాని సమూన్ అన్నారు. శనివారం ఆయన మందస, పలాస, నందిగాం మండలాల్లో పర్యటించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు.
Similar News
News December 20, 2025
వజ్రపుకొత్తూరు: బీచ్‌లో వెనక్కి వెళ్లిన సముద్రం

వజ్రపుకొత్తూరు మండలంలోని శివ సాగర్ బీచ్‌లో సముద్రం వెనక్కి వెళ్లింది. ఒక్కసారిగా 50 మీటర్ల మేర వెనకకు వెళ్లడంతో పర్యాటకులు ఈ వింతను చూసేందుకు తరలివచ్చారు. దీనికి తోడు ఎంతో తక్కువ ఎత్తులో అలలు ఎగిసిపడుతూ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ వాతావరణాన్ని పర్యాటకులు ఆస్వాదించారు. గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు.
News December 20, 2025
శ్రీకాకుళంలో సరిపడా యూరియా నిల్వలు

శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌కు యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయాధికారి కె.శ్రీనాథ స్వామి శుక్రవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 26,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి సిద్ధం చేశామన్నారు. అక్టోబరు 1 నుంచి ఇప్పటివరకు 7,811 మెట్రిక్ టన్నుల విక్రయాలు జరగ్గా, ప్రస్తుతం రైతు సేవా కేంద్రాలు, మార్క్ ఫెడ్ ప్రైవేట్ డీలర్ల వద్ద 2,020 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయన్నారు.
News December 20, 2025
ఎచ్చెర్ల: అధ్యయనపర అవగాహన ఒప్పందం

ఎచ్చెర్లలోని డా.B.R.అంబేడ్కర్ యూనివర్సిటీ కాలిఫోర్నియా (అమెరికా)లోని ఈక్యూ ఫర్ పీస్ అంతర్జాతీయ సంస్థలు ప్రత్యేక అధ్యయనపర అవగాహన ఒప్పందాన్ని శుక్రవారం కుదుర్చుకున్నారు. డా.B.R.అంబేడ్కర్ వర్సిటీ VC రజని, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అడ్డయ్య సమక్షంలో సంతకాలు చేశారు. ఈ ఒప్పందం యూనివర్సిటీ సచ్చిదానంద మూర్తి మత సామరస్య, శాంతి అధ్యయనాల కార్యకలాపాలను బలోపేతం చేస్తాయన్నారు.


