News February 28, 2025
రీ సర్వేను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

యాడికి మండలం చందన రెవెన్యూ గ్రామాల్లో గురువారం రీ సర్వేను జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ పరిశీలించారు. రీ సర్వే జరుగుతున్న విధానాన్ని దగ్గరుండి పరిశీలించారు. రీ సర్వేకు వెళ్లే ముందు రోజే సంబంధిత రైతులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలన్నారు. ఒకవేళ రైతులు హాజరు కాకపోతే మూడుసార్లు అవకాశం ఇవ్వాలన్నారు. రీ సర్వేను పగడ్బందీగా నిర్వహించాలన్నారు.
Similar News
News February 28, 2025
కొత్తచెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

కొత్తచెరువు మండలం అప్పాలోలపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కమ్మవారిపల్లికి చెందిన చక్రధర్ (24) ఈ ప్రమాదంలో మృతి చెందారు. కొత్తచెరువు నుంచి కమ్మవారిపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో చక్రధర్ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు.
News February 28, 2025
ATP: రూ.2.95కోట్ల విలువైన ఫోన్లు రికవరీ

అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం మొబైల్ ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. ఈ మేళాలో జిల్లా ఎస్పీ జగదీశ్ రూ.2.95కోట్ల విలువ చేసే 1,183 ఫోన్లను బాధితులకి అందజేశారు. సాంకేతికత వినియోగించి ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ చెప్పారు. ఇప్పటి వరకు జిల్లా పోలీసు శాఖ 11,378 పోన్లు రికవరీ చేసిందని తెలిపారు. వాటి విలువ సుమారు రూ.21.08 కోట్లు ఉంటుందని వెల్లడించారు.
News February 28, 2025
బడ్జెట్‌లో సూపర్-6 పథకాలకు చిల్లు: అనంత

అసెంబ్లీలో శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో సూపర్-6 పథకాలకు చిల్లు పెడుతున్నారని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను అంకెల గారడిగా అభివర్ణించారు. రైతులు, మహిళలు, ఉద్యోగులకు బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు మోసపూరిత విధానం బహిర్గతం అయ్యిందన్నారు.