News March 19, 2025
రీ సర్వేలో పారదర్శకతకు పెద్ద పీట: కలెక్టర్

జిల్లాలో సమగ్ర భూ సర్వేలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని, అత్యంత జవాబుదారీతనంతో భూ లెక్కలను పక్కాగా తేల్చేందుకే రీసర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు. బుధవారం ఆయన చందర్లపాడు మండలం, ఉస్తేపల్లి గ్రామ పరిధిలో జరుగుతున్న గ్రామ సరిహద్దుల నిర్ధారణ, రెండో దశ రీసర్వే డేటా సేకరణ కార్యకలాపాలను తనిఖీ చేశారు. ఆయన పలు శాఖల అధికారులు, తదితరులు ఉన్నారు.
Similar News
News September 17, 2025
నిజాంసాగర్: దిగువకు 82 వేల క్యూసెక్కులు విడుదల

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద ప్రవాహంతో నిజాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. భారీగా వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తి 82,056 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు, ప్రధాన కాలువ ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని వ్యవసాయ అవసరాల కోసం విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 57,268 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.
News September 17, 2025
HYD: దుర్గా మాత విగ్రహ ప్రతిష్ఠకు ఆన్‌లైన్ నమోదు

సైబరాబాద్‌లో దుర్గామాత నవరాత్రి వేడుకలకు విగ్రహ ప్రతిష్ఠకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని పోలీసులు సూచించారు. భక్తులు, యువకులు, మండపాల నిర్వాహకులు https://policeportal.tspolice.gov.in/index.htm వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకుంటే అధికారులు పరిశీలించి అనుమతులు ఇస్తారని తెలిపారు. అనుమతులు పొందిన తర్వాతే మండపాలు ఏర్పాటు చేయాలన్నారు.
News September 17, 2025
ASF: రక్తదానం చేసి ప్రాణదాతలు కండి: బీజేపీ

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం సేవా పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం తెలిపారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో రక్తం అవసరం పడుతుందన్నారు. జీవితంలో ఒక్కసారి అయినా రక్తదానం చేయాలని అన్నారు.