News August 29, 2024

రుణమాఫీ కాని రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు

image

రుణమాఫీ కాని రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్న ప్రభుత్వ నిబంధన మేరకు కోదాడ మండల వ్యవసాయ అధికారి పాలెం రజని రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకొని సెల్ఫీ ఫొటో తీసుకుంటూ వివరాలను నమోదు చేస్తున్నారు. రేషన్ కార్డు లేని కారణంగా రుణమాఫీ కాని రైతులు తప్పనిసరిగా వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు.

Similar News

News December 31, 2025

NLG: రెండేళ్లలో నలుగురు కలెక్టర్లు బదిలీ

image

నల్గొండ జిల్లాలోని రెండేళ్లలో నలుగురు కలెక్టర్లు బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. 2023 డిసెంబర్‌ నాటికి కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆర్వీ కర్ణణ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మరుసటి నెలలోనే బదిలీ చేశారు. ఆయన స్థానంలో వచ్చిన హరిచందన, ఆ తర్వాత నియమించిన నారాయణరెడ్డి కూడా ఎక్కువ కాలం పని చేయలేదు. ఆయన స్థానంలో ఇలా త్రిపాఠి కలెక్టర్‌గా వచ్చిన సరిగ్గా 14 నెలల్లోనే ఆమెను ప్రభుత్వం బదిలీ చేసింది.

News December 31, 2025

NLG: ఈ ఉద్యోగానికి సాఫ్ట్‌వేర్ కంటే ఎక్కువే జీతం

image

జర్మనీ దేశంలోని పేరొందిన ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. 22 నుంచి 38 ఏళ్ల వయసు, బీఎస్సీ నర్సింగ్, GNM, ఒకటి, రెండేళ్లు క్లినిక్‌లో పనిచేసిన అనుభవం ఉన్నవారికి జర్మన్ భాషలో శిక్షణ అనంతరం నియామకాలు జరుగుతాయన్నారు. నెలకు సుమారు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు చెల్లిస్తారని తెలిపారు. ఆసక్తి గలవారు కార్యాలయంలో సంప్రదించాలి.

News December 31, 2025

NLG: టీఎస్ ఐసెట్ నిర్వహణ MGUకే

image

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి 2026-27 విద్యా సంవత్సరంలో నిర్వహించే ‘టీఎస్ ఐసెట్-2026 నిర్వాహణ బాధ్యతను నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీకే అప్పగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీచేసింది. కాగా ఐసెట్ కన్వీనర్ గా ఎంజీయూ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్, రిజిస్ట్రార్ ప్రొ. అల్వాల రవిని నియమించారు.